Chamala Kiran: హైదరాబాద్ అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది
ABN, First Publish Date - 2023-06-28T17:57:34+05:30
మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ మోడల్ అంటూ హైదరాబాద్ అభివృద్ధిని బీఆర్ఎస్ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు కాంగ్రెస్ హయాంలోనే
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ (KTR) తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ మోడల్ అంటూ హైదరాబాద్ అభివృద్ధిని బీఆర్ఎస్ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు కాంగ్రెస్ హయాంలోనే (Congress) వచ్చాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎంతమందికి ఇచ్చారో కేటీఆర్ సమాధానం చెప్పాలి. కేసీఆర్ (CM KCR) బీఆర్ఎస్ పార్టీ పేరుతో తెలంగాణ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పేద ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకుంటుందా?. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ప్రజలు ఇంటికి పంపడం ఖాయం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ అభివృద్ధి అంతా పైన పటారం లోన లొటారంగా ఉంది.’’ అని కిరణ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
Updated Date - 2023-06-28T17:57:34+05:30 IST