ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: టీఎస్పీఎస్సీ దగ్గర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2023-07-06T16:57:30+05:30

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీఈటీ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం (TSPSC) దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీఈటీ (PET) ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, పీఈటీ అభ్యర్ధుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ (TSPSC Case) ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారుల (SIT Officers) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా మరో ఇద్దరు అరెస్ట్‌ అయ్యారు. పూల రమేష్‌కు హైటెక్ మాస్ కాపీయింగ్‌లో సహకరించేలా ఒప్పందం కుదుర్చుకున్న ఇద్దరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌లోని ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న విశ్వప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు అరెస్ట్ అయ్యారు. ఏఈఈ, డీఏఓ పరీక్షా కేంద్రాల్లో నుంచి ప్రశ్నాపత్రాలు లీక్ చేసే విధంగా పూల రమేష్‌తో విశ్వప్రసాద్, వెంకటేశ్వర్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు విశ్వప్రసాద్, వెంకటేశ్వర్లకు పూల రమేష్ అడ్వాన్స్‌గా ఐదు లక్షలు ఇచ్చాడు. హైటెక్ మాస్ కాపీయింగ్ దర్యాప్తులో భాగంగా ఈ విషయాలను గుర్తించిన సిట్ అధికారులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి అరెస్ట్‌తో లీకేజ్ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 53కు చేరింది. మరో 50 మంది దాకా ప్రశ్నాపత్రాలు లీకేజీ, హైటెక్ మాస్ కాపీయింగ్‌లో నిందితులు ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2023-07-06T16:57:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising