Revanth Reddy: ఆ విషయం కర్ణాటక ప్రజలకు నచ్చలేదు.. అందుకే..
ABN, First Publish Date - 2023-05-13T14:31:25+05:30
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయదుందుబి మోగిస్తోంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయదుంధుబి మోగిస్తోంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు గాంధీభవన్‌లోనూ కాంగ్రెస్ శ్రేణులు స్వీట్లు తినిపించుకున్నారు. గాంధీభవన్‌లో కర్ణాటక ఎన్నికల ఫలితాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy), ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే (AICC Incharge Manikrao Thakre), ఏఐసీసీ సెక్రెటరీలు, ఇతర నేతలు వీక్షిస్తున్నారు. ఫలితాలపై రేవంత్ మాట్లాడుతూ... కోలార్ సభలో రాహుల్ మాట్లాడిన దానికి రాహుల్‌పై (Rahul Gandhi) అనర్హత వేటు వేయడం, ఇళ్ళు ఖాలీ చేయించడం కర్ణాటక ప్రజలకు నచ్చలేదన్నారు. అదాని అవినీతిపై మాట్లాడితే రాహుల్‌పై కక్ష్య సాధించారని మండిపడ్డారు. గులాంనబీ అజాద్ ఎక్స్ ఎంపీ అయి చాలా రోజులు అయిందని.. అయినా ఇళ్ళు ఎందుకు ఖాలీ చేయించలేదని ప్రశ్నించారు. రాహుల్ ఇళ్ళును ఇంత త్వరగా ఖాలీ చేయించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. అదానితో తమకు సంబందం లేదంటున్న బీజేపీ.. అదానిని విమర్శిస్తే బీజేపీ ఎందుకు ఉలిక్కిపడుతుందని అడిగారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఓక్కటే అని ప్రజలు భావిస్తున్నారని.. అందుకే బీఆర్ఎస్‌ను ప్రజలు ఇంటికి పంపిస్తారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-05-13T14:31:25+05:30 IST