ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితిపై సీఎంకు రేవంత్ లేఖ

ABN, First Publish Date - 2023-05-09T14:00:45+05:30

జూనియర్ పంచాయతీ సెక్రటరీల రెగ్యులరైజేషన్ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జూనియర్ పంచాయతీ సెక్రటరీల రెగ్యులరైజేషన్ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (CM KCR) టీపీసీసీ చీఫ్ బహిరంగ లేఖ రాశారు. తమ ప్రభుత్వంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందన్నారు. వాళ్లతో గొడ్డు చాకిరీ చేయించుకుని వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. గత 12 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదని విమర్శించారు. దేశంలోనే మా పంచాయతీలు ఆదర్శం అందుకే కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది అని గొప్పలు చెప్పుకుంటోందని.. ఆ గొప్పల వెనుక జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పడిన శ్రమ ఉందన్నారు. వారి కష్టంతో రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు 79 అవార్డులు వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దని ఆయన తెలిపారు.

ఇంత చేసి అవార్డులు తెస్తే వారి సర్వీసులను రెగ్యులర్ చేయకుండా వేధించడం సరైంది కాదన్నారు. వారి కష్టానికి తమ ప్రభుత్వం ఇచ్చే రివార్డు ఇదేనా? అని ప్రశ్నించారు. సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరకుంటే తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడటం మీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఎంతో పనిభారం పెరిగినా భరిస్తూ రెగ్యులర్ చేస్తారని వారు ఆశగా ఎదురు చూశారని అన్నారు. నాలుగేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ముగిసినా తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన ఉన్నట్టా లేనట్టా అని నిలదీశారు. ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచి, వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు కూడా సిద్ధమవుతామని రేవంత్ రెడ్డి లేఖలో స్పష్టం చేశారు.

Updated Date - 2023-05-09T14:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising