ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Traffic Rules: వాహనాల రాకపోకలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2023-04-16T12:01:07+05:30

వాహనాల రద్దీని తగ్గించేందుకు, ప్రమాదాలను నివారించేందుకు సిటీలోకి పలు వాహనాలను ప్రవేశాన్ని రద్దు చేస్తూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ (Traffic) సమస్యను పరిష్కరించేందుకు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్( Hyderabad Police Commissioner CV Anand) కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాల రద్దీని తగ్గించేందుకు, ప్రమాదాలను నివారించేందుకు సిటీలోకి పలు వాహనాలను ప్రవేశాన్ని రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. నెమ్మదిగా కదిలే వాహనాలు ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నాయని, ఈ వాహనాలతో సాధారణ ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఫిర్యాదు ఎక్కువగా రావడంతో సీపీ సీవీ ఆనంద్ వాటిపై నిషేధం విధించారు. వివిధ రాష్ట్రాలనుంచి వచ్చే భారీ వాహనాలు, లారీలు, నేషనల్ పర్మిట్ లారీలు, లోకల్ లారీలు, ప్రైవేట్ బస్సులపై సీపీ ఆంక్షలు విధించారు.

సిటీలో నిర్మాణ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు భారీ వాహనాలకు సిటీలోకి నిషేధం అమలులో ఉంటుంది. భారీ వాహనాలు, అధిక బరువుతో వెళ్లే వాహనాలు సిటీలో ప్రవేశించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. సామాగ్రిని మోసుకెళ్లే లోకల్ వాహనాలకు రాత్రి 11 గంటలనుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రైవేట్ బస్సులకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతిలేదు. నిబంధనలు అతిక్రమిస్తే వాహనదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2023-04-16T12:01:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising