TS News: ‘ఆ సమయంలో శబ్దాలు వస్తాయి.. భయపడొద్దు’
ABN, First Publish Date - 2023-04-19T14:18:21+05:30
సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతి ప్రాంతంలో ఫైర్ సేఫ్టీ పై అవగాహన కలిపిస్తున్నామని తెలంగాణ (Telangana) ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి (DG Nagireddy) తెలిపారు.
హైదరాబాద్: సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతి ప్రాంతంలో ఫైర్ సేఫ్టీ పై అవగాహన కలిపిస్తున్నామని తెలంగాణ (Telangana) ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి (DG Nagireddy) తెలిపారు. అందులో భాగంగా ఈరోజు మాదాపూర్ యశోద హాస్పిటల్స్‌లో ఫైర్ సేఫ్టీ వర్క్ షాప్ నిర్వహించామని వెల్లడించారు. యశోద హాస్పిటల్స్‌లో చాలా బాగా ఫైర్ సేఫ్టీ రేటెడ్ అధికారులను పెట్టుకున్నారని పేర్కొన్నారు. ప్రతి హాస్పిటల్ లో ఫైర్ సేఫ్టీ అనేది అవసరమన్నారు. ఈ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికీ ఫైర్ సేఫ్టీ పై అవగాహన ఇస్తే చాలా బాగుంటుందని, అందులో నర్సులకి కుడ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందన్నారు. ముఖ్యంగా ఫైర్ ఎక్స్టెన్స్ ఉంటాయి వాటిని ఎలా వాడాలి అనే దాంట్లో అవగహన ఉండాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ వాడేటప్పుడు చాలా శబ్దాలు వస్తాయి అలాంటప్పుడు భయపడకుండా పట్టుకుంటే కొద్దిసేపటికి సౌండ్ రావడం బంద్ అవుతుంది కావున అలా భయపడకుండా పట్టుకొని ఎలా ఉపయోగించాలో తెలుసుకొని వాడితే ప్రమాదాల నుండి బయట పడవచ్చన్నారు. మాదాపూర్ యశోద హాస్పిటల్స్‌లో ఫైర్ సేఫ్టీ వర్క్ షాప్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, ఫైర్ సేఫ్టీ అధికారులు,హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-04-19T14:18:23+05:30 IST