ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: రేవంత్‌రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన కామెంట్స్

ABN, First Publish Date - 2023-04-22T16:42:22+05:30

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గ‌త చ‌రిత్ర ప్ర‌జ‌లంద‌రికీ తెల్సిందేనని మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గ‌త చ‌రిత్ర ప్ర‌జ‌లంద‌రికీ తెల్సిందేనని మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు. ప‌బ్లిక్‌లో రేవంత్‌కు బ్లాక్ మెయిల‌ర్ అనే పేరుందని విమర్శించారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ప‌ద‌వుల‌ను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు దోచుకున్న రేవంత్ .. ఇప్పుడు భాగ్య‌ల‌క్ష్మి గుడి వ‌ద్ద ప్ర‌మాణాలంటే న‌మ్మేదెవ‌రు? అని ప్రశ్నించారు. లెక్క‌లేన‌న్ని త‌ప్పుడు ప‌నులు చేస్తున్న రేవంత్ భాగ్య‌ల‌క్షి గుడిలో అడుగు పెడితే, ఆ దేవాల‌యం అప‌విత్రం అవుతుంద‌నేది భ‌క్తుల భావ‌న‌ అన్నారు. రాజ‌కీయ వ్య‌భిచారం చేసే వ్య‌క్తి రేవంత్ అని మండిపడ్డారు. త‌న స్వార్ధం కోసం భాగ్య‌ల‌క్షి గుడిని కూడా వాడుకోవ‌డం భావ్యం కాదని సూచించారు.

‘‘టీడీపీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరిన రాజకీయ వ్యభిచారివి నువ్వు కాదా రేవంత్. ఈటెల రాజేందర్, నేను ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారామే కానీ, నీ మాదిరిగా ఒక పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవితో మరో పార్టీలో చేరి రాజకీయ వ్యభిచారం చేయలేదు. కాంగ్రెస్ హైక‌మాండ్ పెద్దలకు డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కోవ‌డం ద్వారా రాజ‌కీయ వ్యభిచారానికి పాల్ప‌డింది నువ్వు కాదా రేవంత్. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత‌తో కలిసి వ్యాపార లావాదేవీలు చేసింది వాస్త‌వం కాదా, ఆమెతో నీకు వ్యాపార‌ భాగస్వామ్యం లేదా, ఓటుకు నోటు కేసులో ల‌క్ష‌ల రూపాయ‌ల నోట్ల క‌ట్ట‌ల‌తో రెడ్ హాండెడ్‌గా దొరికి జైలుకు వెళ్లిన నీ చరిత్ర రాజ‌కీయ వ్య‌భిచారం కాదా? అని ప్రశ్నించారు.

‘‘మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి 25 కోట్లు కాంగ్రెస్‌కు ముట్టాయని, అయితే అందులో ప‌ది కోట్లు రేవంత్ నొక్కేసాడని కాంగ్రెస్ నేతలే అంతర్గతంగా మాట్లాడుకుంటున్న విష‌యం వాస్త‌వం కాదా. మునుగోడులో బీజేపీ గెలిస్తే తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌త‌న‌మ‌వుతుంద‌ని, అందుకే న‌న్ను ఓడించేందుకు బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని ఆ పార్టీని గెలిపించ‌డం రాజ‌కీయ వ్య‌భిచారం కాదా రేవంత్. న‌న్ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌, మునుగోడులో న‌న్ను ఓడించేందుకు ఎలాంటి ఆధారాలు లేకుండా నాపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసి, 18 వేల కోట్ల‌కు అమ్ముడు పోయానంటూ టీఆర్ఎస్‌తో క‌లిసి దుష్ప్ర‌చారం చేయ‌డం రాజ‌కీయ వ్యభిచారం కాదా రేవంత్.’’ అని ప్రశ్నించారు.

పార‌ద‌ర్శకంగా జ‌రిగిన‌ గ్లోబల్ కాంపిటీటివ్ బిడ్డింగ్‌లో టెండర్ దక్కితే, ఆ వాస్త‌వాన్ని దాచి అమ్ముడు పోయానంటూ తప్పుడు ఆరోపణ చేసిన దగుల్బాజీ రేవంత్ , మ‌రి నీ దగ్గ‌ర ఆధారాలుంటే ఎందుకు రుజువు చేయ‌డం లేదు? అని ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోప‌ణ‌ల‌ను రుజువు చేయ‌క‌పోతే రేవంత్‌ను వ‌దిలే ప్ర‌సక్తే లేదన్నారు. రాజ‌కీయంగా రేవంత్‌ను వేటాడుతానన్నారు. అలాగే కోర్టు ద్వారా కూడా రేవంత్ సంగ‌తి తేలుస్తానని సవాల్ విసిరారు. తాను దాఖలు చేయ‌నున్న ప‌రువు న‌ష్టం కేసులో ఎప్ప‌టికైనా రేవంత్ జైలుకు వెళ్ల‌డం ఖాయమన్నారు.

Updated Date - 2023-04-22T16:42:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising