ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC Leak: సిట్‌ విచారణకు సంజయ్‌ దూరం!

ABN, First Publish Date - 2023-03-24T05:53:40+05:30

టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ కేసులో ఏర్పాటైన సిట్‌ ఇచ్చిన నోటీసుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించబోరని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ కేసులో ఏర్పాటైన సిట్‌ ఇచ్చిన నోటీసుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించబోరని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సిట్‌ ఇచ్చిన నోటీసు ప్రకారం ఈనెల 24న (నేడు) విచారణకు ఆయన హాజరుకాబోరని స్పష్టం చేశాయి. అలాగే, సంజయ్‌ ప్రస్తుతం పార్లమెంటు సమావేశాల్లో ఉన్నారని, విప్‌ కూడా జారీ అయిందని పార్టీ నాయకులు తెలిపారు.

టీఎస్‌పీఎస్సీ లీకేజీకి సంబంధించి మంత్రి కేటీఆర్‌పై సంజయ్‌ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో, వాటికి సంబంధించి ఆయన వద్ద ఉన్న ఆధారాలను తమకు అందించాలని, ఈ మేరకు శుక్రవారం విచారణకు రావాలంటూ సిట్‌ నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా, ఆ నోటీసులకు స్పందించరాదని, విచారణకు హాజరు కారాదని ఆయన నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక, సిట్‌పై తనకు నమ్మకం లేదని, హైకోర్టు సిటింగ్‌ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపిస్తేనే ఆధారాలు అందజేస్తానని సంజయ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.

నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు

కేసీఆర్‌ సర్కార్‌ తాటాకు చప్పుళ్లకు తాము భయపడే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ట్విటర్‌ టిల్లును కేబినెట్‌ నుండి బర్తరఫ్‌ చేసే వరకూ వదిలి పెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తనకు లీగల్‌ నోటీసులు ఇచ్చారనే వార్తలపై గురువారం ఆయన స్పందించారు. చట్ట, న్యాయబద్ధంగా వాటికి తగిన సమాధానమిస్తామన్నారు. రాజకీయంగా, ప్రజా క్షేత్రంలో పోరాడతామన్నారు.

టీఎస్‌పీఎస్సీతో తనకు సంబంధం లేదని ట్విట్టర్‌ టిల్లు చెప్పడం పెద్ద జోక్‌ అని, ఆయనది నాలుకా? తాటిమట్టా? అని విమర్శించారు. ఏ సంబంధం లేకపోతే సీఎం నిర్వహించే సమీక్షలో ఎందుకు పాల్గొన్నారని నిలదీశారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యా శాఖ మంత్రి, చీఫ్‌ సెక్రటరీ, టీఎస్‌పీఎస్సీ అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ పేపర్‌ లీకేజీకి ఇద్దరు వ్యక్తులే కారణమని ఎట్లా చెబుతారని నిలదీశారు. లీకేజీ వెనక బీజేపీ, బండి సంజయ్‌ కుట్ర ఉందని ఎట్లా ఆరోపిస్తారని ప్రశ్నించారు.

రాష్ట్రంలోని అన్ని శాఖల తరపున వకాల్తా పుచ్చుకుని ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రిగా ఉంటూ ట్విటర్‌ టిల్లు స్పందిస్తే తప్పు లేనప్పుడు.. ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షంగా తాము మాట్లాడితే తప్పేముందని ప్రశ్నించారు. ‘‘ప్రతిపక్షాలకు నోటీసులిచ్చే కొత్త సంప్రదాయానికి ట్విటర్‌ టిల్లు తెరలేపడం సిగ్గుచేటు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై నోరెత్తకుండా ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలో భాగం. వైఫల్యాలను, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే బెదిరించడం, కేసులు పెట్టడం. తమ తాబేదారు సంస్థలతో నోటీసులు ఇప్పించడం, అరెస్ట్‌ చేయించడం కేసీఆర్‌ సర్కార్‌కు అలవాటుగా మారింది’’ అని విమర్శించారు.

పంట నష్టం కింద రైతులకు కేంద్రం పైసా సాయం చేయలేదని మంత్రి నిరంజన్‌ రెడ్డి చెప్పడం పచ్చి అబద్దమన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల నుంచే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం చెల్లిస్తోందని, ఇందులో 75 శాతం వాటా కేంద్రానిదేనని తెలిపారు. అయినా, కేంద్రం పైసా ఇవ్వలేదని సోయి లేకుండా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడటం విడ్డూరమన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్‌ బీమా యోజన పథకం బాగోలేదని చెబుతున్న కేసీఆర్‌ ప్రభుత్వం ఇన్నాళ్లూ ప్రత్యామ్నాయ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. ఆ పథకం ద్వారా సాయం అందకుండా రైతుల నోట్లో ఎందుకు మట్టికొట్టిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లైనా ఇంతవరకు సమగ్ర పంటల విధానాన్ని, బీమా పాలసీని తీసుకురాకుండా కేంద్రంపై బురద చల్లడం సిగ్గు చేటన్నారు.

Updated Date - 2023-03-24T05:53:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising