TSRTC: ప్రయాణికల కోసం టీఎస్‌ఆర్టీసీ సరికొత్త యాప్.. మహిళల కోసం ప్రత్యేకంగా...
ABN, First Publish Date - 2023-08-12T12:47:03+05:30
ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బస్సు ట్రాకింగ్ యాప్ "గమ్యం" పేరుతో సరికొత్త యాప్‌ను టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల ముందుకు తెచ్చింది.
హైదరాబాద్: ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బస్సు ట్రాకింగ్ యాప్ "గమ్యం" పేరుతో సరికొత్త యాప్‌ను టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల ముందుకు తెచ్చింది. శనివారం ఉదయం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) టీఎస్‌ఆర్టీసీ గమ్యం యాప్‌ను ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే టీఎస్ఆర్టీసీ గమ్యం యాప్ లక్ష్యం. ఈ కొత్త యాప్‌తో బస్ ట్రాకింగ్, దగ్గరలోని బస్సు ఎక్కడుంది, బస్ స్టాప్ల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యాప్‌లో మహిళల కోసం ప్రత్యేక సదుపాయాన్ని కలిపించారు. బస్ స్టాప్లు లేని దగ్గర ఫ్లాగ్ బస్ ఆప్షన్‌తో మహిళలు బస్సు ఎక్కే సదుపాయాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఫ్లాగ్ ఎ బస్ ఆప్షన్ అందుబాటులో ఉండేలా ఆర్టీసీ అధికారులు యాప్‌ను రూపొందించారు.
Updated Date - 2023-08-12T12:48:27+05:30 IST