Kishan Reddy: అధ్యక్షుడిగా ఉంటారో.. లేదో చెప్పేసిన కిషన్‌రెడ్డి
ABN, First Publish Date - 2023-07-05T16:26:46+05:30
తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షులను అధిష్టానం ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో అయోమయం నెలకొంది. ఏం జరుగుతోందన్న గందరగోళం చోటుచేసుకుంది. ప్రాముఖ్యంగా తెలంగాణలో అయితే గజిబిజీ గందరగోళంగా మారింది. బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తప్పించి.. కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించారు. అసలు బండి సంజయ్‌ను ఎందుకు తప్పించారో.. కిషన్‌రెడ్డిని ఎందుకు నియమించారో ఆ పార్టీ సీనియర్లకు అర్థంకాక తలలు పట్టుకున్నారు.
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షులను అధిష్టానం ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో అయోమయం నెలకొంది. ఏం జరుగుతోందన్న గందరగోళం చోటుచేసుకుంది. ప్రాముఖ్యంగా తెలంగాణలో అయితే గజిబిజీ గందరగోళంగా మారింది. బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తప్పించి.. కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించారు. అసలు బండి సంజయ్‌ను ఎందుకు తప్పించారో.. కిషన్‌రెడ్డిని ఎందుకు నియమించారో ఆ పార్టీ సీనియర్లకు అర్థంకాక తలలు పట్టుకున్నారు. తీరా కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించాక.. మీడియా ముందుకు రాలేదు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి (Kishan Reddy) పాల్గొన్నారు. కానీ మీడియాతో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో ఆయనకు అధ్యక్ష పదవి ఇష్టం లేదని వార్తలు వచ్చాయి. మరోవైపు అధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై బండి సంజయ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇంకోవైపు పార్టీ సీనియర్లు.. ఈ మార్పులను తీవ్ర వ్యతిరేకిస్తున్నారు. ఇలా తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో అర్థం కాక ఆ పార్టీ నేతలు అసహనానికి గురయ్యారు. ఎట్టకేలకు బుధవారం మధ్యాహ్నం కిషన్‌రెడ్డి ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు.
ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు కిషన్‌రెడ్డి రానున్నారు. నగరానికి చేరుకున్నాక.. పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి ఆలోచన కలిగి ఉందో నేతలకు వివరించనున్నారు. అలాగే ఈనెల 8న వరంగల్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై కూడా కిషన్‌రెడ్డి చర్చించనున్నారు. గురువారం ఉదయం వరంగల్‌లోకి వెళ్లి ప్రధాని పర్యటన ఏర్పాట్లను కిషన్‌రెడ్డి పరిశీలించనున్నారు.
ఢిల్లీలో కిషన్‌రెడ్డి ఏమన్నారంటే..!
బీజేపీ హైకమాండ్ నిర్ణయం మేరకు ముందుకు సాగుతానని కిషన్‌రెడ్డి వెల్లడించారు. తాను పార్టీకి విధేయుడినని.. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని స్పష్టం చేశారు. జూలై 8న వరంగల్‌లో ప్రధాని మోడీ పర్యటన తర్వాత పార్టీ అధ్యక్ష బాధత్యలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి పదవి విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని కిషన్‌రెడ్డి తెలిపారు.
Updated Date - 2023-07-05T16:31:20+05:30 IST