ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uttam Kumar Reddy: బీజేపీ వైఫల్యాలను ప్రతీ రాష్ట్రంలో తెలుపుతున్నాం..

ABN, First Publish Date - 2023-05-27T12:28:52+05:30

విజయవాడ: ‘నౌ సాల్.. నౌ సవాల్’.. అంటూ బీజేపీ (BJP) వైఫల్యాలను ప్రతీ రాష్ట్రంలో తెలుపుతున్నామని కాంగ్రెస్ నేత (Congress Leader) ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ‘నౌ సాల్.. నౌ సవాల్’.. అంటూ బీజేపీ (BJP) వైఫల్యాలను ప్రతీ రాష్ట్రంలో తెలుపుతున్నామని కాంగ్రెస్ నేత (Congress Leader) ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. ఈ సందర్బంగా శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రేపటి పార్లమెంటు ప్రారంభం రాజ్యాంగ విధానాలకు వ్యతిరేకంగా ఉండటంతో బాయ్ కాట్ (Boy Cat) చేస్తున్నామన్నారు. స్వాతంత్య్రయం తరువాత అతితక్కువ పార్లమెంట్ పనిదినాలు ప్రధాని మోదీ వచ్చాకే జరుగుతున్నాయని ఆరోపించారు. ఏ ఒక్క ప్రశ్నకూ పార్లమెంటులో సమాధానం చెప్పనిది నరేంద్రమోదీయేనని.. ఏ చట్టాలు చేసినా ఎటువంటి చర్చ లేకుండా పాస్ చేసింది మోదీయేనని విమర్శించారు.

దేశంలో పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడని, 2014 నుంచీ నిత్యావసరాలు, ఆయిల్, పెట్రోలు ధరలు అధికంగా పెరిగిపోయాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రైతుల ఆందోళన విరమించడానికి కారణమైన కనీస మద్దతు ధర పూర్తిగా వదిలేసారని, రైతు రోజువారీ ఆదాయం 27 రూపాయలుగా తమ రిసెర్చ్‌లో తేలిందన్నారు. రూ. 12లక్షల కోట్లు అదానీ అంశంతో మార్కెట్ నష్టపోయిందని, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక 14 సీ పోర్టులు అదానీకి వచ్చాయని ఆరోపించారు. దేశ సంపదను గౌతం అదానీకి నరేంద్ర మోదీ అప్పజెప్పారని, మోదీ ప్రధాని అయ్యాక కొన్ని వేల కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని అన్నారు.

తాను ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్ పైలట్‌గా పని చేశానని, దేశంలో అన్ని పార్టీలు కుల ఆధారిత సెన్సెస్ చేయాలన్నదానికి కట్టుబడి ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ బలహీనపరిచి ఆదివాసీలకు రక్షణ లేకుండా చేశారని, సీబీఐ పెట్టిన కేసుల్లో 99శాతం కేసులు ప్రతిపక్ష నేతల మీద పెట్టినవేనన్నారు. 90 వేల కోట్ల నరేగా బడ్జెట్ 60 వేల కోట్లకు తగ్గించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2023-05-27T12:28:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising