ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijayashanthi : సొంత పార్టీ నేతలే టార్గెట్‌గా వరుస ట్వీట్లు.. బీజేపీలో హాట్ టాపిక్‌గా విజయశాంతి

ABN, First Publish Date - 2023-07-27T11:02:42+05:30

సొంత పార్టీ నేతలే టార్గెట్‌గా బీజేపీ నాయకురాలు విజయశాంతి వరుస ట్వీట్లు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విజయశాంతి వ్యవహారం వాత పెట్టి.. వెన్న పూసిన మాదిరిగా ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ను ఉద్దేశించే విజయశాంతి ట్వీట్స్ చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.

హైదరాబాద్ : సొంత పార్టీ నేతలే టార్గెట్‌గా బీజేపీ నాయకురాలు విజయశాంతి వరుస ట్వీట్లు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విజయశాంతి వ్యవహారం వాత పెట్టి.. వెన్న పూసిన మాదిరిగా ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ను ఉద్దేశించే విజయశాంతి ట్వీట్స్ చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటకీ పార్టీలో కొంత మంది హైకమాండ్ కు ఫిర్యాదులు చేయటమే పనిగా పెట్టుకున్నారని విజయశాంతి మండిపడుతున్నారు. ఫిర్యాదులను బంద్ చేయకుంటే పార్టీకి తీవ్ర నష్టమన్న.. బండి సంజయ్ కామెంట్స్ ను ట్విట్టర్ ద్వారా రాములమ్మ హెచ్చరిస్తున్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ మంచి విజయాలు సాధించాలని కోరుకుంటునట్లు తెలిపారు. మొత్తానికి బీజేపీలో విజయశాంతి వరుస ట్వీట్స్ గందరగోళంగా మారాయి.

మణిపూర్ ఘటనపై సైతం..

మణిపూర్ ఘటనపై కూడా విజయశాంతి ట్విటర్ వేదికగా కాస్త ఘాటుగానే స్పందించారు. బీజేపీ ప్రభుత్వమే ఉన్న మణిపూర్‌‌లో జరుగుతున్న దారుణమైన ఘటనపై బీజేపీ కీలక నేతలెవ్వరూ పెదవి విప్పడం లేదు. విజయశాంతి మాత్రం అక్కడి బీజేపీ ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించడం గమనార్హం. మణిపుర్‌లో జరుగుతున్న సంఘటనలు యావత్ దేశాన్ని త్రీవ్ర వేదనకు గురిచేస్తున్నాయన్నారు. సభ్యసమాజం సిగ్గుతో బాధపడుతోందని రాములమ్మ పేర్కొన్నారు. అంతేకాకుండా మహిళ విషయంలోని నేరస్థులను ఉరి తీసి శిక్షించాలని డిమాండ్ కూడా చేశారు.మొత్తానికి విజయశాంతి సొంత పార్టీపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆమె పార్టీ మారుతారన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2023-07-27T11:02:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising