ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayashanti: తీన్మార్ మల్లన్నపై దాడులు, అరెస్టులు దుర్మార్గం

ABN, First Publish Date - 2023-03-21T23:46:11+05:30

తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)పై దాడులు, అరెస్టులు దుర్మార్గామని బీజేపీ(Bjp) సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)పై బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం చేస్తున్న దాడులు, అరెస్టులు దుర్మార్గామని బీజేపీ(Bjp) సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు. మంగళవారం సోషల్ మీడియా(Social media)లో కేసీఆర్ ప్రభుత్వం(KCR Govt)పై రాములమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వార్తను యథతధంగా ఇస్తున్నాం. ‘‘ కేసిఆర్ ప్రభుత్వం ఎమర్జెన్సీ(Emergency)ని తలపిస్తోంది. ఇక ప్రజాస్వామ్య తెలంగాణ(Democratic Telangana)ను మీ నుంచి కాపాడుకోవాల్సిన అవసరం తిరిగి మా ఉద్యమకారులకి వచ్చింది కావచ్చు. రేపటికి తీన్మార్ మల్లన్నపై మీ తప్పుడు అరెస్టులను వెనక్కు తీసుకోకుంటే, తెలంగాణ ప్రజల తిరుగుబాటును మీరు కూడా చూస్తారు. తెలంగాణ కోసం కేసులు, జైళ్లు, కొట్లాటలు, త్యాగాలు అన్నీ సహించిన ఉద్యమకారిణిగా నేను చెప్తున్న మాట ఇది. మీరు చేస్తున్నది అత్యంత దారుణం. ఆ బిడ్డలను విడిచిపెట్టండి’’ అని కేసీఆర్ ప్రభుత్వ తీరుపై విజయశాంతి ధ్వజమెత్తారు.

Updated Date - 2023-03-22T00:30:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising