Vinayaka Chavithi : వినాయక చవితి 18న లేదంటే 19న జరుపుకోవాలా ?
ABN, First Publish Date - 2023-09-06T13:14:17+05:30
వినాయక చవితి ఏ తేదీన నిర్వహించాలనే దానిపై సందిగ్ధం ఏర్పడింది. దీనిపై తెలంగాణ విద్వత్సభ గౌరవ సలహాదారు ఆకెళ్ళ జయకృష్ణ శర్మ సిద్ధాంతి వివరణ ఇచ్చారు.
హైదరాబాద్: వినాయక చవితి ( Vinayaka chavithi 2023) ఏ తేదీన నిర్వహించాలనే సందిగ్ధతపై తెలంగాణ విద్వత్సభ గౌరవ సలహాదారు ఆకెళ్ళ జయకృష్ణ శర్మ సిద్ధాంతి వివరణ ఇచ్చారు. ఈ సంవత్సరం శ్రీ శోభకృత్ నామ సంవత్సర భాద్రపద శు ౹౹ తృతీయ సోమవారం (18 - 09 - 2023) రోజున వినాయక చవితి పండుగ తెలంగాణలో అందరూ జరుపుకోవాలని తెలంగాణ విద్వత్ సభలో సుమారు వంద మంది పండితులందరూ ఏకముఖముగా నిర్ణయించడం జరిగిందన్నారు. చవితి తిథి 18వ తేదీనే ఉంది కాబట్టి అదే జరుపుకోవాలని నిర్ణయించామన్నారు.
ఇక ఇదే విషయమై కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దేవస్థానం పండితులు కూడా స్పష్టత ఇచ్చారు. ‘‘ఈ నెల 18నే వినాయక చవితి జరుపుకోవాలి. కాణిపాకంలో అదే రోజున నిర్వహిస్తున్నాం. చంద్రమానం ప్రకారం చవితి తిథి 18వ తేదీనే ఉంది. ఆ రోజు నుంచి 21 రోజుల పాటుకాణిపాకంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం’’ అని స్పష్టం చేశారు.
Updated Date - 2023-09-06T13:45:29+05:30 IST