ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad Rains: హైదరాబాద్‌లో ఈ రైల్వే బ్రిడ్జి వైపు వెళ్లే వాహనదారులకు అలర్ట్..

ABN, First Publish Date - 2023-07-20T11:57:40+05:30

లింగంపల్లి రైల్వే అండర్ పాస్ క్రింద వర్షపు నీరు భారీగా చేరుకుంది. బ్రిడ్జ్ కింద రాకపోకలు బంద్ అయ్యాయి. బ్రిడ్జి కింద భారీ వర్షపు నీటితో వాహనదారులు ప్రజల ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గడిచిన కొన్ని గంటలుగా వర్షం కురుస్తుండటంతో నీళ్లంతా అండర్ పాస్ కిందకు వచ్చేశాయి. దీంతో బ్రిడ్జ్ కింద రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిలిపివేశారు.

హైదరాబాద్: లింగంపల్లి రైల్వే అండర్ పాస్ క్రింద వర్షపు నీరు భారీగా చేరుకుంది. బ్రిడ్జ్ కింద రాకపోకలు బంద్ అయ్యాయి. బ్రిడ్జి కింద భారీ వర్షపు నీటితో వాహనదారులు ప్రజల ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గడిచిన కొన్ని గంటలుగా వర్షం కురుస్తుండటంతో నీళ్లంతా అండర్ పాస్ కిందకు వచ్చేశాయి. దీంతో బ్రిడ్జ్ కింద రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిలిపివేశారు. ఇదిలా ఉండగా.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ నగరవాసులు ట్రాఫిక్‌లో అష్టకష్టాలు పడుతున్నారు.


ముఖ్యంగా మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్, కొండాపూర్, హైటెక్స్ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. భారీగా కురిసిన వర్షానికి రోడ్లపైన నీరు చేరడంతో పాటు.. కొండాపూర్ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో.. ఐకియా, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎడతెరిపిలేని వర్షంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. రాయదుర్గం, బయోడైవర్సిటీ, ఖాజాగూడ మార్గంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. వర్షంలో తడుస్తూ ట్రాఫిక్‌లో వాహనదారుల నరకయాతన అనుభవించారు.

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. గ్రేటర్ హైదరాబాద్‌కు అతి భారీ వర్ష సూచన చేయడంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC హెచ్చరిక జారీ చేసింది. GHMC DRF టోల్ ఫ్రీ నెంబర్ 9000113667ను నగరవాసులకు అందుబాటులో ఉంచింది. భారీ వర్షాలతో తెలంగాణలో 2 రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణలో స్కూళ్లకు సెలవు ప్రకటించడం గమనార్హం. కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రి సబిత పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

Updated Date - 2023-07-20T11:57:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising