ShivSena Reddy: కేసీఆర్ అసెంబ్లీకి ఎలా వస్తారో చూస్తాం
ABN, First Publish Date - 2023-01-25T14:43:15+05:30
పోలీస్ రిక్రూట్‌మెంట్ (Police Recruitment)లో తప్పిదాలకు లక్షలాది మంది యువత బలయ్యారని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి (ShivSena Reddy) ఆరోపించారు
హైదరాబాద్: పోలీస్ రిక్రూట్‌మెంట్ (Police Recruitment)లో తప్పిదాలకు లక్షలాది మంది యువత బలయ్యారని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి (ShivSena Reddy) ఆరోపించారు. గవర్నర్ తమిళిసైను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనరెడ్డి కలిసి పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో జరిగిన లోపాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి శ్రీనివాస్ దృష్టికి పదే పదే తీసుకెళ్లిన స్పందించడం లేదు. 7 మార్కులు కలపాలని హైకోర్టు (High Court) సూచించినా చేయడం లేదు. ప్రభుత్వం, బోర్డు పట్టించుకోవడం లేదు.. దీంతో గవర్నర్‌ను కలిశాం. డ్రైవింగ్ (Driving) కోసం చేసే రిక్రూట్‌మెంట్‌కు కూడా రన్నింగ్, లాంగ్ జంప్ పెట్టారు. బోర్డు చైర్మన్ 3 మీటర్లు కూడా రాయి విసరలేదు.. అభ్యర్థులు మాత్రం 6 మీటర్లు విసరాలా..? ఇప్పటి వరకు 18 మంది విద్యార్థులు చనిపోయారు. వారికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి. రన్నింగ్ క్వాలిఫై అయిన వారిని మెయిన్‌కు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరాం. కోర్టు సూచన మేరకు మార్కులు కలపాలి. ప్రభుత్వం స్పందించకపోతే కేసీఆర్ (kcr) అసెంబ్లీ (Assembly)కి ఎలా వస్తారో చూస్తాం.’’ అంటూ శివసేన రెడ్డి హెచ్చరించారు.
Updated Date - 2023-01-25T14:45:51+05:30 IST