ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sharmila: టెన్త్ పేపర్ లీక్ దోషులను శిక్షించాల్సిందే.. కానీ..

ABN, First Publish Date - 2023-04-06T16:16:26+05:30

టెన్త్ పేపర్ లీక్ కేసులో (Tenth Paper Leak Case) దోషులను శిక్షించాల్సిందేనని.. కానీ టెన్త్ పేపర్ లీక్ దర్యాప్తు మీద పెట్టిన శ్రద్ధ.. టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్ మీద ఎందుకు పెట్టడం లేదని షర్మల ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: టెన్త్ పేపర్ లీక్ కేసులో (Tenth Paper Leak Case) దోషులను శిక్షించాల్సిందేనని.. కానీ టెన్త్ పేపర్ లీక్ దర్యాప్తు మీద పెట్టిన శ్రద్ధ.. టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్ మీద ఎందుకు పెట్టడం లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని (BRS Govt.) ప్రశ్నించారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పెద్ద తలకాయలు బయటపడుతాయనా?.. "బంది పోట్ల రాష్ట్ర సమితి" నేతల కండ్లకు, చెవులకు 30 లక్షల మంది నిరుద్యోగుల కన్నీటి రోదన కనపడడం, వినపడటం లేదా? అని నిలదీశారు.

టెన్త్ పేపర్ బయటకు వచ్చేంతగా తలుపులు తెరిచారు అంటే బీఆర్ఎస్‌ది దిక్కుమాలిన పాలన కాదా? అని షర్మిల ప్రశ్నించారు. పేపర్ బయటికి రాగానే ముగ్గురు టీచర్లను డిస్మిస్ చేసి, బలి చేసిన ప్రభుత్వం... టీఎస్పీఎస్సీ ఉద్యోగులు, బోర్డు సభ్యులు, చైర్మన్‌ను వెంటనే ఎందుకు తొలగించలేదని నిలదీశారు. ఇందులో బీఆర్ఎస్ బడా నేతల హస్తం ఉందనా?.. లేక వాళ్లంతా మీ తొత్తులనా? అంటూ షర్మిల దుయ్యబట్టారు. ‘‘టెన్త్ పేపర్ లీకుల్లో స్వయానా ప్రతిపక్ష నేత హస్తం ఉందని తేల్చిన పోలీస్ వ్యవస్థ.... టీఎస్పీఎస్సీ లీకుల స్కాంలో దాగి ఉన్న నీ ఇంటి దొంగలను బయట పెట్టకపోతే... రానున్న ఎన్నికల్లో నీ ప్రభుత్వానికి నిరుద్యోగులు ఘోరీ కట్టడం తథ్యం’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-04-06T16:16:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising