YS Vijayamma: ‘నేను కొట్టాలనుకుంటే కొట్టగలను.. నేను కొట్టలేదు’
ABN, First Publish Date - 2023-04-24T14:34:59+05:30
వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల పాదయాత్రను ఆపాల్సిన అవసరం లేదని వైఎస్ విజయమ్మ అన్నారు.
హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) పాదయాత్రను ఆపాల్సిన అవసరం లేదని వైఎస్ విజయమ్మ (YS Vijayamma) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశిస్తున్నారనే షర్మిలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. షర్మిల టెర్రరిస్ట్ కాదన్నారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడ్డారు. ఎప్పుడూ చూసిన షర్మిల ఇంటి చుట్టూ పోలీసులు ఉంటున్నారన్నారు. షర్మిలను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో కారణం చెప్పమంటే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని చెబుతున్నారని తెలిపారు. షర్మిలకు వ్యక్తి గత స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. ‘‘పోలీసులు మీద మీద పడుతుంటే ఆవేశం రాదా.. నేను కొట్టాలనుకుంటే కొట్టగలను..నేను కొట్టలేదు’’ అని అన్నారు. నియంత, అసమర్ధ పాలనను ప్రశ్నిస్తున్నారని... ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల సిట్ కార్యాలయానికి వెళ్తుంటే అరెస్ట్ చేశారని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు.
కాగా.. పోలీసులపై చేయి చేసుకున్న కారణంగా వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. షర్మిలపై ఐపీసీ 330, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన వైఎస్ విజయమ్మ.. కూతురు షర్మిలను పరామర్శించేందుకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. విజయమ్మను పోలీసులు అడ్డుకోవడంతో విజయమ్మ అసహనం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్‌పై విజయమ్మ చేయి చేసుకున్నారు.
Updated Date - 2023-04-24T14:39:35+05:30 IST