YS Sharmila: ‘తెలంగాణ సొమ్ము మీ తాత జాగీరా కేసీఆర్?’
ABN, First Publish Date - 2023-05-06T14:06:52+05:30
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) మరోసారి విరుచుకుపడ్డారు. ‘‘తెలంగాణ సొమ్ము మీ తాత జాగీరా కేసీఆర్?’’ అంటూ మండిపడ్డారు. తెలంగాణ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉద్యోగాలు ఇవ్వడం చేతకాలేదు కానీ.. పక్క రాష్ట్రంలోని మీ పార్టీ వ్యక్తికి రూ.18లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తావా? అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ సంపద ఏమైనా మీ అత్తగారి సొమ్మా?. తెలంగాణ కొలువులు ఏమైనా మీ ఇంట్లో..నౌకరు పదవులా మీ ఇష్టారాజ్యంగా రాసివ్వడానికి?. అందుకోసమేనా పేపర్లు లీక్ చేసి అమ్ముకుంటున్నారు?. జీవోలు దాచిపెట్టి కొలువులు కట్టబెడుతున్నారు?. నీ పార్టీ ఖజానాలో ఉన్న రూ.1250 కోట్లు సరిపోవడం లేదా?. ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలను కూడా నీ పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టాలని చూస్తున్నావా?. ఇలా జీవోలను దాచిపెట్టి ఇంకా ఎంతమందికి కొలువులు ఇచ్చారు? . మీ పార్టీ కార్యకర్తలకు పదవుల కోసం ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని’’ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Updated Date - 2023-05-06T14:06:52+05:30 IST