ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: సాయంత్రానికి షర్మిల బయటకు వస్తారు: న్యాయవాది

ABN, First Publish Date - 2023-04-25T14:35:28+05:30

పోలీసులపై చేయి చేసుకున్న కేసులో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పోలీసులపై చేయి చేసుకున్న కేసులో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు (YSRTP Chief YS Sharmila) నాంపల్లి కోర్టు (Nampalli Court) బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులతో కూడిన బెయిల్‌ను షర్మిలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా షర్మిల తరపు న్యాయవాది సంతోష్ (Lawyer Santosh) మీడియాతో మాట్లాడుతూ.. మూడు షరతులతో షర్మిలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. రూ.30 వేల పూచీకత్తుతో కూడిన రెండు షూరిటీలు సమర్పించాలని, దేశం విడిచి బయటకు వెళ్ళరాదని అనే షరతు పెట్టారన్నారు. మరో గంటలో ఆర్డర్ కాపీ వస్తుందని తెలిపారు. ఆపై సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య షర్మిల జైలు నుంచి బయటకు వస్తారన్నారు. కోర్టు వాదనలు బలంగా వినిపించామని చెప్పారు. పదుల సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టడంతో తోపులాట క్రమంలో జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా పోలీసులపై చేయి చేసుకోలేదు అని నిరూపించామని న్యాయవాది సంతోష్ పేర్కొన్నారు. ప్రస్తుతం షర్మిల చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

కాగా.. టీఎస్‌‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో (TSPSC Leakage Case) సిట్‌ అధికారులను కలిసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆమె.. ఓ ఎస్సై స్థాయి అధికారిపై చేయిచేసుకోగా, మరో మహిళా కానిస్టేబుల్‌ను చేత్తో నెట్టేశారు. ఓ కానిస్టేబుల్‌ గాయాలపాలవడానికి కారణమయ్యారు. చివరకు షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాంధీలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను కోర్టులో హాజరుపర్చగా.. వచ్చే నెల 8వ తేదీ వరకు కోర్టు రిమాండ్‌ విధించింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు.. షర్మిలను పరామర్శించేందుకు పీఎస్‌కు వెళ్లిన విజయలక్ష్మిని పోలీసులు అడ్డుకున్నారు. ఇలా ఉండగా వైఎస్‌ విజయలక్ష్మ్డి కూడా విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారా? లేదా? అన్న దానిపై పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Updated Date - 2023-04-25T14:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising