YS Sharmila: ఆ తల్లిదండ్రుల ఉసురు మీకు, మీ సర్కార్‌కు తగలక మానదు.. ప్రవళిక ఆత్మహత్యపై షర్మిల
ABN, First Publish Date - 2023-10-14T14:09:02+05:30
విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్యపై వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఉద్యోగాలు లేక ప్రవళిక లాంటి అమ్మాయి ఉరి వేసుకొని బలవన్మరనానికి పాల్పడుతుంటే.. కేసీఆర్‌ను చూసి ఓటెయ్యండని ఎలా అడుగుతున్నారు?’’ అని ప్రశ్నించారు.
హైదరాబాద్: విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్యపై వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఉద్యోగాలు లేక ప్రవళిక లాంటి అమ్మాయి ఉరి వేసుకొని బలవన్మరనానికి పాల్పడుతుంటే.. కేసీఆర్‌ను చూసి ఓటెయ్యండని ఎలా అడుగుతున్నారు? ఉద్యోగం సాధించి వస్తానమ్మా అని పట్నం వెళ్లిన బిడ్డ విగతజీవిగా వస్తే ఆ తల్లిదండ్రుల గుండె కోత ఎలా ఉంటుందో తెలుసా మీకు. ప్రవళికది ఆత్మహత్య కాదు.. మీ సర్కార్ చేసిన హత్య. నష్ట జాతకురాలు ప్రవళిక కాదు.. అన్ని అధికారాలున్నా నిరుద్యోగుల కోసం ఏం చేయలేని పాలకులు నష్ట జాతకులు. ఉద్యోగాలకు సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాలేదు.. ఒక్క పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించడం చేతకాలేదు. ఏం చూసి మిమ్మల్ని మళ్లీ ఎన్నుకోవాలి? ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేసినందుకా.. నిరుద్యోగ భృతి అని దొంగ హామీ ఇచ్చినందుకా.. అంగట్లో సరుకుల్లా టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్లు అమ్ముకున్నందుకా.. పేపర్ లీకులు, పరీక్ష వాయిదాలు, కేసులు, కోర్టులు.. మీ పాలనలో నిరుద్యోగుల దుస్థితి ఇది. గద్దెనెక్కిన నాటి నుంచి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఉద్యోగం లేక ప్రాణాలు తీసుకుంటున్న చెట్టంత బిడ్డలని కోల్పోతున్న ఆ తల్లిదండ్రుల ఉసురు మీకు, మీ సర్కార్‌కు తగలక మానదు’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
Updated Date - 2023-10-14T14:09:02+05:30 IST