ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YS Sharmila: పాలేరు బరిలో షర్మిల.. హీటెక్కిన తెలంగాణ రాజకీయం

ABN, First Publish Date - 2023-10-12T16:23:32+05:30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) రణరంగంలోకి వైఎస్సార్టీపీ(YSRTP) పార్టీ దిగబోతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ క్యాడర్‌ను వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సిద్ధం చేస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) రణరంగంలోకి వైఎస్సార్టీపీ(YSRTP) పార్టీ దిగబోతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ క్యాడర్‌ను వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సిద్ధం చేస్తున్నారు. గురువారం నాడు వైఎస్సార్టీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీ చేస్తాం. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా. పాలేరు సహా మరో స్థానం నుంచి పోటీ చేస్తా. అమ్మ విజయలక్ష్మి, అనిల్‌‌కుమార్ కూడా పోటీ చేయాలని పార్టీ నుంచి డిమాండ్‌‌లో ఉంది. అవసరమైతే విజయలక్ష్మి కూడా పోటీ చేస్తారు. తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేస్తాం. బీఫామ్‌ల కోసం నేతలు దరఖాస్తు చేసుకోవాలి. కాంగ్రెస్‌తో కలిసి వెళ్తే వ్యతిరేక ఓటు చీలదనుకున్నాం. కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం.. 4 నెలలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కోసం ఎదురుచూశాం. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్ సంక్షేమ పాలనను తీసుకువస్తాం’’ అని షర్మిల పేర్కొన్నారు.

Updated Date - 2023-10-12T22:17:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising