Bandi Sanjay: బీజేపీ వస్తే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం: బండి సంజయ్
ABN, First Publish Date - 2023-04-15T20:10:30+05:30
బీజేపీ (BJP) వస్తే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఆ పార్టీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ప్రకటించారు. వరంగల్‌లో నిర్వహించిన
వరంగల్: బీజేపీ (BJP) వస్తే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఆ పార్టీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ప్రకటించారు. వరంగల్‌లో నిర్వహించిన ‘నిరుద్యోగ మార్చ్’లో సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ (Telangana)లో ఏ పరీక్ష నిర్వహించినా తప్పుల తడకేనని విమర్శించారు. నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ (TSPSC) కేసులో మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలన్నారు. ఈనెల 21న పాలమూరు గడ్డపై నిరుద్యోగ మార్చ్, అంతేకాకుండా 10 ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్, తర్వాత హైదరాబాద్ (Hyderabad)లో మిలియన్ మార్చ్ జరుపుతామని తెలిపారు. సీఎం కేసీఆర్ (CM KCR) పెట్టిన సిట్‌లు ఏ కేసునూ తేల్చలేదన్నారు.
అవినీతి, తప్పుల నుంచి చేతులు దులుపుకునేందుకే సిట్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై పోరాడుతున్నామనే.. తమపై టెన్త్ పేపర్ లీక్ ఆరోపణ చేశారని మండిపడ్డారు. ప్రశ్నిస్తారనే పేదలను విద్యకు దూరం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా ఇవ్వని దుర్మార్గుడు కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందే కేసీఆర్‌కు మహనీయులు గుర్తుకొస్తారని, కేసీఆర్ తొలిసారి నిన్న అంబేడ్కర్ జయంతి వేడుకలో పాల్గొన్నారని సంజయ్ విమర్శించారు.
Updated Date - 2023-04-15T20:10:30+05:30 IST