ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy: కేసీఆర్‌పై బీజేపీ చర్యలు తీసుకోవాలని భావిస్తే.. 12 మందిపై కూడా..

ABN, First Publish Date - 2023-02-10T23:35:52+05:30

పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శలు గుప్పించారు. నకిలీ నాయకులు తెలంగాణను దోచుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను రాజకీయంగా బొంద పెట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన 12 మందిని ప్రజాకోర్టులో ఉరితీసినా తప్పులేదని రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ (KCR) అక్రమాలపై బీజేపీ (BJP) చర్యలు తీసుకోవాలని భావిస్తే 12 మంది ఎమ్మెల్యేలపై కూడా సీబీఐ విచారణ జరపాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలా చేయకపోతే కేసీఆర్‌కు బండి సంజయ్, కిషన్‌రెడ్డి లొంగిపోయినట్లే రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరెంట్ కోతలపై రైతులు రోడ్డెక్కుతున్నారని, కల్వకుంట్ల రాజ్యాన్ని ఖతం చేసి ప్రజారాజ్యాన్ని నిర్మించుకుందామని రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి తన సంచలన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రగతి భవన్‌ను నక్సలైట్లు బాంబులు పెట్టి పేల్చేయాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేవంత్.. ఈరోజు కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.

రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఐదో రోజు రేవంత్ రెడ్డి కొత్త లింగాల గ్రామంలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు. కాంగ్రెస్‌లో గెలిచి పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లోనే కాదు.. జీవితంలోనే ఎమ్మెల్యే అనే పదానికి వాళ్లకు దూరం చేసి.. రాజకీయంగా బొంద పెట్టాలంటూ కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒక తాను ముక్కలేనని.. ఇద్దరి మధ్య బూడూపుటానీ నడుస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలన్నారు. పార్టీ ఫిరాయింపులను అడ్డుకున్నప్పుడే.. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతుకుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి సీఎం కేసీఆర్ అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారని ఆరోపించారు. ఈ ఫిరాయింపులపై రాజకీయ పార్టీలు స్పష్టంగా ముందుకు రావాలన్నారు.

Updated Date - 2023-02-10T23:36:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising