Hanmantharao : కలకలం రేపుతున్న మైనంపల్లి హనుమంతరావు ఆడియో.. కేసీఆర్ కుటుంబ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు..
ABN, First Publish Date - 2023-08-27T04:29:52+05:30
సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన తీవ్ర వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో కలకలం రేపుతోంది. ఇప్పటికే మంత్రి హరీశ్‌రావుపై విమర్శలకు దిగి సంచలనం రేపిన నేపథ్యంలో ఈ పరిణామం మరింత చర్చనీయాంశం అవుతోంది. తాజాగా బయటడిన మైనంపల్లి వ్యాఖ్యల ఆడియో వైరల్‌గా మారింది.
నేనుండబట్టి ఇట్ల ఉంది.. లేదంటే మొత్తం దోచేసేవాళ్లు
సీఎం అన్న కొడుకు ఒక దిక్కు.. మొత్తం అల్లుళ్లు అంతా ఓ దిక్కు
90% రెడ్లకు చెందిన ప్లాట్లను నేనే కాపాడిన
కన్నారావుకు గట్టిగ చెప్పిన.. మా ఫ్యామిలీ
మెంబర్.. పోనీలే అన్నా.. అని కవిత అన్నది
టీడీపీలో ఉన్నప్పుడు జై సమైక్యాంధ్ర అన్నా..!
అంత దమ్ము నాకు తప్ప ఎవరికైనా ఉందా?
కలకలం సృష్టిస్తున్న మైనంపల్లి ఆడియో
మల్లారెడ్డి వర్గమే లీక్ చేసిందంటూ ప్రచారం
మైనంపల్లి ఆడియో కలకలం
హైదరాబాద్, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన తీవ్ర వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో కలకలం రేపుతోంది. ఇప్పటికే మంత్రి హరీశ్‌రావుపై విమర్శలకు దిగి సంచలనం రేపిన నేపథ్యంలో ఈ పరిణామం మరింత చర్చనీయాంశం అవుతోంది. తాజాగా బయటడిన మైనంపల్లి వ్యాఖ్యల ఆడియో వైరల్‌గా మారింది. సంభాషణ ప్రకారం విషయం రూ.కోట్ల విలువైన భూములకు సంబంధించినదిగా తెలుస్తోంది. ఆడియోలో ఉన్నదాని ప్రకారం.. ‘‘నేనుండబట్టి ఇట్ల ఉంది. లేదంటే మొత్తం దోచేస్తుండే వాళ్లు.. వాళ్లు.. సీఎం అన్న కొడుకు ఒక దిక్కు.. మొత్తం అల్లుళ్లు అందరు ఒక దిక్కు. 90 శాతం రెడ్ల ప్లాట్లను బచాయించిన (కాపాడిన) మొన్న. సీఎం అన్న కొడుకు కన్నారావుకు కూడా గట్టిగ చెప్పిన. కేటీఆర్‌కు కూడా చెప్పిన.. చంపేస్తా అని. కవితనే.. పోనీలే అన్న మా ఫ్యామిలీ మెంబర్ అని అన్నది. ఆయన.. సీఐ గారూ రక్షించండి అంటే.. సీఐ ఏంజేస్తడు పాపం మధ్యలో పోయి. సీఎం మేనల్లుడు, నర్సింగరావు తమ్ముడు ఉమే్‌షరావు, కాంతారావు కలిసి సీఐపై ఒత్తిడి చేస్తున్నారంట. కేటీఆర్ దగ్గరికి పోయిన్రు.
గుండు సుధారాణి వచ్చింది. రేవంత్‌రెడ్డి. శ్రీధర్‌బాబు నాకు ఫోన్ చేసిండు. రూ.20 కోట్లు ఇస్తా అన్నరని చెప్పిండు. నువు చెప్పినంక తీసుకుంటానా? అని బదులిచ్చా. ఉమే్‌షరావు, కాంతారావు పాగల్ అయితరు.. సీఎం ఆఫీసులో యాంటీగా చెప్తరు మళ్లీ.. అని చెప్పినా. వాళ్లు ఏం పీకుతారు..? ఒకసారి కేటీఆర్ ముందుకు వెళ్లకుండా బాల్క సుమన్ ఆపిండు. ఏయ్.. ఇడువ్ భయ్ అన్న. ఆయన ఎంపీ. నువ్వు ఈడేం జేస్తున్నవ్. హైదరాబాద్ రానియ్య బిడ్డ అని అన్న. లేదన్నా.. కేటీఆర్‌కు డిస్ట్రబ్ అవుతుందన్నడు. నువ్వేంది ఆపేది? అని తీసుకున్న. ఆయనెవరు ఆపడానికి మనం హైదరాబాద్ వాళ్లమని అన్న. కేసీఆర్, కేటీఆర్‌కే కాదు. ప్రధానమంత్రికి కూడా భయపడను. మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సమైక్యాంధ్ర అన్నా. అలా అనే దమ్ము నాకు తప్ప ఇంకెవరికైనా ఉందా..? నేనెంత గలీజుగాన్నో నీకు తెల్వదు. నా స్టైల్‌లో నేనుంట’’ అని మాట్లాడారు. ఈ ఆడియోను మంత్రి మల్లారెడ్డి వర్గమే లీక్ చేసిందంటూ మైనంపల్లి వర్గం ప్రచారం చేస్తోంది.
కవిత రాయబారం
ఇప్పటివరకు సొంత పార్టీ నేతలపైనే మైనంపల్లి విమర్శలు చేస్తుండగా, ఆడియోలో సీఎం కుటుంబానికి చెందినవారిపై తీవ్ర విమర్శలకు దిగారు. అయినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే అంశంపై మైనంపల్లిని తగ్గేలా చేసి, తర్వాత నిర్ణయం తీసుకుందామని, కొద్ది రోజులు వేచి చూద్దామని ఎమ్మెల్సీ కవిత సూచించినట్లు సమాచారం. మరోవైపు మైనంపల్లి వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ‘శిఖరంలాంటి హరీశన్నపై సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు చర్య తీసుకోకపోవడం పట్ల కార్యకర్తగా చాలా బాధపడుతున్న’ అని మహేశ్‌రెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ‘కొడుకు కరోనాలో ప్రజలకు సహయం చేసిండు. అందుకే రాజకీయ అవకాశం ఇవ్వండి. రాజకీయాల్లో ఇపుడు ఇదే ట్రెండ్’ అంటూ తెలంగాణ మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ ట్వీట్ చేశారు.
Updated Date - 2023-08-27T07:10:33+05:30 IST