Janasena: కూకట్‌పల్లి ‘జనసేన’ అభ్యర్థిగా ప్రేమకుమార్
ABN, First Publish Date - 2023-11-08T10:01:14+05:30
కూకట్‌పల్లి(Kukatpally) నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ప్రముఖ బిల్డర్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్(Premakumar)ను
కూకట్‌పల్లి(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి(Kukatpally) నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ప్రముఖ బిల్డర్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్(Premakumar)ను ఖరారు చేశారు. కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఆయన బీజేపీ టికెట్ ఆశిస్తూ ఆరునెలల క్రితం ఆ పార్టీలో చేరారు. కూకట్‌పల్లి టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తున్నట్లు తెలియడంతో ఆయన జనసేనలో ఇటీవల చేరారు. ఈ మేరకు జనసేన నాయకత్వం ప్రేమకుమార్‌ను అభ్యర్థిగా నిర్ణయించారు. ఆయనకు అభిమానులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు.
విద్యాభ్యాసం తర్వాత ఇళ్ల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ప్రేమకుమార్ అంచెలంచెలుగా ఎదిగి వెస్ట్‌జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. విద్యార్థి దశలోనే అనేక పోరాటాలు చేయడం, స్వయంసేవక్ ద్వారా విద్యార్థుల సమస్యలపై ఆమరణ నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ప్రజలకు సేవలందించేందుకు లయన్స్ క్లబ్‌లో చేరారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల తరఫున మల్టీపుల్ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా చాలాకాలం పనిచేశారు. అప్పట్లో ఆర్గాన్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, దివ్యాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ, పేదలకు ఆర్థిక సహాయం వంటి సేవా కార్యక్రమాలతోపాటు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు ఆర్థిక సహాయం చేశారు. పేదలకు మరింత సేవలందించేందుకు రాజకీయాల్లోకి వచ్చారు.
బయోడేటా :
...................................
నియోజకవర్గం: కూకట్‌పల్లి
అభ్యర్థి పేరు : ముమ్మారెడ్డి ప్రేమకుమార్
తల్లి పేరు : మహాలక్ష్మి
తండ్రి పేరు : వెంకటాచలం (లేటు)
భార్య పేరు : విజయలక్ష్మి
కుమార్తెలు : డా.తేజశ్రీ, హేమశ్రీ
పుట్టిన తేదీ : 06/08/1966
విద్యార్హతలు : ఎం.కామ్, ఎంబీఏ
కులం : కాపు
చిరునామా : విల్లా నెంబర్ 155, రామ్‌కీ పెరల్స్, హెచ్‌ఎంటీ
శాతవాహనగర్, కూకట్‌పల్లి, హైదరాబాద్
Updated Date - 2023-11-08T10:01:16+05:30 IST