JP Nadda: బీజేపీ చీఫ్ సంచలన కామెంట్స్.. బీఆర్‌ఎస్ పాలనలో భారీగా అవినీతి, అక్రమాలు
ABN, First Publish Date - 2023-11-26T13:02:51+05:30
తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలన అవినీతి, అక్రమాలతో సాగిందని, ఆ పార్టీని ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపాలని జేజేపీ జాతీయ అధ్యక్షుడు
బౌద్ధనగర్, (ఆంధ్రజ్యోతి): తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలన అవినీతి, అక్రమాలతో సాగిందని, ఆ పార్టీని ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపాలని జేజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ప్రజలకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణికి రోడ్ షో నిర్వహించగా నడ్డా పాల్గొన్నారు. శనివారం సాయంత్రం చిలకలగూడ అమర్‌టాకీస్ చౌరస్తా నుంచి వారాసిగూడ చౌరస్తా వరకు రోడ్ షో సాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు నడ్డాకు బ్రహ్మరథం పట్టారు. వారాసిగూడలో నిర్వహించిన సభలో నడ్డా మాట్లాడుతూ తొమ్మిదన్నర సంవత్సరాల్లో బీఆర్‌ఎస్ ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడిందన్నారు. కాంగ్రెస్ గతంలో స్కామ్‌లకు పాల్పడిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) పేదప్రజల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. బంగారు తెలంగాణ బాగుపడాలంటే బీజేపీకే పట్టం కట్టాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని నడ్డా పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలందరూ బీజేపీకి మద్దతు ఇచ్చి మేకల సారంగపాణిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నడ్డాకు ఆయన చిత్రపటాన్ని సారంగపాణి అందజేశారు. రోడ్ షోలో మాజీ మేయర్ బండకార్తీకరెడ్డి, రాచమల్ల కృష్ణమూర్తి, కందాడి నాగేశ్వరరెడ్డి, కనకట్ల హరి, ప్రభుగుప్తా, మేకల కీర్తి హర్షకిరణ్, గణేశ్‌ముదిరాజ్, శారదా మల్లేష్, ప్రభుగుప్తా, అంబాల రాజేశ్వరరావు, భాస్కరగిరి పాల్గొన్నారు.
Updated Date - 2023-11-26T13:02:53+05:30 IST