ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajaiah Vs Kadiam Srihari: రాజయ్యకు కడియం శ్రీహరి డెడ్‌లైన్‌

ABN, First Publish Date - 2023-07-10T18:03:47+05:30

ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. స్టేషన్ ఘనపూర్ కేంద్రంగా కడియం వర్సెస్ రాజయ్యగా మారింది. ఈ ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. స్టేషన్ ఘన్‌పూర్ కేంద్రంగా కడియం వర్సెస్ రాజయ్యగా మారింది. ఈ ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు. కడియం శ్రీహరి (Kadiam Srihari) ఓ అవినితీ తిమింగలం అంటూ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (MLA Thatikonda Rajaiah) ఘాటైన విమర్శలు చేశారు. అయితే రాజయ్య ఆరోపణలపై శ్రీహరి సోమవారం ఘాటుగా స్పందించారు. ఆరోపణలు నిరూపించకపోతే రాజయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు వారం రోజుల డెడ్‌లైన్ ఇచ్చారు. ‘‘మా ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధం. మూడు దశాబ్దాల్లో ఎవరినీ మోసం చేయలేదు. ఎవరి నుంచైనా డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే.. పోటీ నుంచి తప్పుకుంటా. రాజయ్య కుటుంబంపై నేను నోరు విప్పితే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటుంది’’ అని కడియం ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కడియం.. అవినీతి తిమింగలం: రాజయ్య

కడియం.. ఓ అవినితీ తిమింగలం అంటూ రాజయ్య ఆదివారం తీవ్రమైన ఆరోపణలు చేశారు. టీడీపీ హయాంలో నీటి పారుదల శాఖల మంత్రిగా పనిచేసిన కాలంలో కడియం చేసిన అక్రమాలపై ఓ పుస్తకం వెలువరించారని, త్వరలోనే ఆ పుస్తకాన్ని బయటకు తీస్తానని రాజయ్య అన్నారు. బెంగళూరు, మలేషియా, సింగపూర్‌, ఆంధ్ర, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న ఆయన అక్రమ ఆస్తులను బయటపెడతానన్నారు. ఇటీవల ఆయన మండలాల్లో పర్యటిస్తూ లక్షలాదిగా ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యే కాకముందే 40 ఎకరాల ఆస్తి, నాలుగు కార్లు ఉన్నాయని, భార్య, కుమారులు, కోడళ్లు ఉద్యోగులు, వైద్యులుగా సంపాదన ఉందని, చట్ట ప్రకారం ఆస్తులు కలిగి ఉన్నానని తెలిపారు. కడియం శ్రీహరి కులంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని రాజయ్య వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

రాజయ్య వర్సెస్ కడియం

కడియం శ్రీహరి, రాజయ్యల మధ్య వైరుధ్యానికి చాలా చరిత్ర ఉంది. గతంలో కడియం శ్రీహరి టీడీపీ, రాజయ్య కాంగ్రెస్‌ పార్టీలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉండేవారు. రాజయ్య తెలంగాణ ఉద్యమ కాలంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రసమితిలో చేరారు. అనంతర కాలంలో కడియం కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అయితే ఇద్దరిమధ్య శత్రువైఖరి మాత్రం కొనసాగుతూనే ఉంది. 2014లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాజయ్యకు అద్భుత అవకాశం దక్కింది. కడియం శ్రీహరి వరంగల్‌ లోక్‌సభ సభ్యుడిగా ఘన విజయం సాధించారు. కొద్ది కాలానికే రాజయ్య ఉప ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. అనూహ్యంగా అదే పదవి కడియం శ్రీహరికి దక్కింది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. 2018 ఎన్నికల్లో కడియం శ్రీహరి స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అవకాశం మాత్రం రాజయ్యకే దక్కింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి పోటీ చేసేందుకు కడియం శ్రీహరి సిద్ధపడి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Updated Date - 2023-07-10T18:12:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising