Kadiam Srihari: మాజీమంత్రి కడియం సంచలన వ్యాఖ్యలు.. నా మార్కు ఏంటో చూపిస్తా..
ABN, First Publish Date - 2023-08-24T13:43:37+05:30
వచ్చే ఐదేళ్లలో ఘన్పూర్ నియోజకవర్గాన్ని రెట్టింపు అభివృద్ధి చేసి తన మార్కు చూపిస్తానని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే
స్టేషన్‌ఘన్‌పూర్(జనగామ): వచ్చే ఐదేళ్లలో ఘన్పూర్ నియోజకవర్గాన్ని రెట్టింపు అభివృద్ధి చేసి తన మార్కు చూపిస్తానని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి(Kadiam Srihari) అన్నారు. సీఎం కేసీఆర్ ఆయనను బీఆర్ఎస్(BRS) అభ్యర్థిగా ప్రకటించిన తరువాత మొదటిసారిగా బుధవారం నియోజకవర్గ కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా రాఘవాపూర్, ఛాగల్, గ్రామాల మీదుగా తాటికొండ క్రాస్ రోడ్డు వరకు ర్యాలీగా వచ్చారు. అక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాపోలు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఘన్పూర్ శివాజీ సర్కిల్ వరకు అశేష జనంతో కడి యం ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ లో కడియం ప్రసంగించారు. ఘన్పూర్ ప్రజల ఆశీర్వాదంతో 14ఏళ్లు మంత్రిగా పని చేశానని గుర్తు చేశారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదని, చేసినట్లు ని రూపిస్తే ముక్కు నేలకు రాసి క్షమాపణ అడుగుతానని అన్నారు. పనికిరాని, పసలేని కొన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తున్నాయని, ప్రజలు, కార్యకర్తలు వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు సీహెచ్ నరేందర్ రెడ్డి, రాపోలు మధుసూదన్, బెలిదె వెంకన్న, దేశినేని హన్మంతరావు, మందపురం ఎల్లాగౌడ్, సూదుల రత్నాకర్ రెడ్డి, భూర్ల శంకర్, అన్నం బ్రహ్మారె డ్డి, రాంబాబు, రజాక్‌యాదవ్, కోతి రాములు, రజాక్‌యాదవ్, నెలమంచ అజయ్ రెడ్డి, తోట వెంకన్నతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-24T13:43:37+05:30 IST