ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bandi Sanjay: కేసీఆర్‌కు జనం మీద.. జనం ఓట్ల మీద నమ్మకం లేదు

ABN, First Publish Date - 2023-11-01T16:51:10+05:30

అసెంబ్లీలో టోపీ పెట్టుకుని, కర్ర పట్టుకుని ప్రొజెక్టర్ చూపిస్తూ చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదు?, కాంట్రాక్టర్లు, కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ ప్రాజెక్ట్ నాణ్యత మీద లేదు. తాంత్రిక పూజుల ద్రవ్యాలు కలపడం కోసమో, కాంట్రాక్టర్

ఢిల్లీ: సీఎం కేసీఆర్‌కు (CM KCR) జనం మీద, జనం ఓట్ల మీద నమ్మకం లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘కేసీఆర్‌కు వశీకరణ మీద నమ్మకం ఉంది. నిమ్మకాయలు పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్నారు. పూజలు చేస్తే తప్పు లేదు. జనహితం కోసం చేస్తే ఫలిస్తాయి. ఇంకొకరి నాశనం కోసం చేసే పూజలు ఫలించవు. మోటార్లు మునిగిపోతే సీఎం మాట్లాడలేదు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోతే మాట్లాడలేదు. అన్నారం లీక్ అవుతుంటే మాట్లాడలేదు. టెండర్ల సమయంలో మాత్రమే సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. దేశం మొత్తం తిరిగి కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకున్నారు. నదులకు నడకలు నేర్పిన నేత అని చెప్పుకున్నారు. నదిలో ఇసుక ద్వారా వేల కోట్ల దోపిడీ చేశారు. లీకేజ్, పగుళ్ల విషయంలో సీఎం స్పందించకపోవడం దారుణం.’’ అని మండిపడ్డారు.

‘‘అసెంబ్లీలో టోపీ పెట్టుకుని, కర్ర పట్టుకుని ప్రొజెక్టర్ చూపిస్తూ చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదు?, కాంట్రాక్టర్లు, కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ ప్రాజెక్ట్ నాణ్యత మీద లేదు. తాంత్రిక పూజుల ద్రవ్యాలు కలపడం కోసమో, కాంట్రాక్టర్ నుంచి కమిషన్ల కోసమో ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్తారు తప్ప నాణ్యత పరిశీలించడం కోసం కాదు. నాణ్యత లోపం కారణంగానే ఇది జరిగింది. తెలంగాణలో చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు. కానీ కేసీఆర్ ఎవరి మాట వినలేదు. ఆయనే ఇంజనీర్‌లా వ్యవహరించారు. క్షమాపణ చెప్పిన తర్వాతనే రైతుల ఓట్లు అడగాలి. ఈ ప్రభుత్వం కట్టిన వంతెనలు కోల్పోతున్నాయి. ప్రాజెక్టులు కుంగిపోతున్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇలాగే ఉన్నాయేమో. ఆ నష్టాన్ని సీఎం కుటుంబం నుంచే రికవరీ చేయాలి. విద్రోహ చర్య అంటే వైఫల్యం ఎవరిది? బాధ్యత ఎవరిది?.’’ అని బండి సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Updated Date - 2023-11-01T16:51:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising