ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ponnam Prabhakar: నువ్వు మగాడివైతే టీడీపీలో ఉండి గెలువు.. గంగులకు పొన్నం సవాల్

ABN, First Publish Date - 2023-06-21T12:55:07+05:30

మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్ మగాడివైతే టీడీపీలో ఉండి గెలవాలని సవాల్ విసిరారు. బుధవారం పొన్నం మీడియాతో మాట్లాడుతూ... ఔట్ డేటెడ్ అని మీ వినోద్ రావుని అన్నవా గంగుల అంటూ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) వ్యాఖ్యలపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (Former MP Ponnam Prabhakar) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్ మగాడివైతే టీడీపీలో ఉండి గెలవాలని సవాల్ విసిరారు. బుధవారం పొన్నం మీడియాతో మాట్లాడుతూ... ఔట్ డేటెడ్ అని మీ వినోద్ రావుని అన్నవా గంగుల అంటూ ప్రశ్నించారు. ‘‘నా ఓటమి గురించి మాట్లాడుతున్నావ్.. సీఎం కూతురు కవిత ఓడిపోలేదా’’ అని వ్యాఖ్యలు చేశారు. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న కరీంనగర్ పార్లమెంట్‌లో వినోద్ రావు ఎంపీగా ఓడిపోలేదా అని నిలదీశారు. గంగుల దొంగ రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. దున్నపోతులా బలిసి రైతుల గురించి పట్టించుకోవట్లేదని విరుచుకుపడ్డారు. బీజేపీ నేత బండి సంజయ్, మంత్రి గంగుల ఆలయాల్లో కలుసుకుంటున్నారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం రోజుకో పండుగను నిర్వహించడంపైనా మాజీ ఎంపీ విమర్శలు గుప్పించారు. దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బెల్ట్ షాప్‌ల పండుగ మరిచిపోయారు అంటూ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.

కాగా.. నిన్న(మంగళవారం) పొన్నం ప్రభాకర్‌పై మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లోనే పొన్నం విలువ బయటపడిందని... కనీసం కార్పోరేటర్‌ను కూడా గెలిపించుకోలేదని ఎద్దేవా చేశారు. ఎంఐఎం మాత్రమే కాదని.. తన మీద కేఏ పాల్, షర్మిల కూడా పోటీ చేయవచ్చన్నారు. తన పని తాను చేసుకుంటానని.. తన జోలికి వస్తే విడిచిపెట్టబోనని హెచ్చరించారు. తన మీద పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ కేసులు వేశారన్నారు. వారిద్దరూ ఒక్కటేనన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ విచారణలో ఏమీ తేలలేదన్నారు. ఎన్నికల ముందు గానా బజానాలు రావడం సహజమేనన్నారు. బీఆర్ఎస్ 60 శాతం, కాంగ్రెస్, బీజేపీ రెండు కలిపి నలభై శాతమేనని గంగుల అన్నారు.

Updated Date - 2023-06-21T12:55:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising