ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Karimnagar: గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-11-10T14:08:34+05:30

కరీంనగర్: తెలంగాణను ఇతరుల చేతుల్లో పెట్టవద్దని, పొరపాటున వేరేవారికి అధికారం ఇస్తే రాష్ట్రం ఆగమాగమవుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు.

కరీంనగర్: తెలంగాణను ఇతరుల చేతుల్లో పెట్టవద్దని, పొరపాటున వేరేవారికి అధికారం ఇస్తే రాష్ట్రం ఆగమాగమవుతుందని మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ సంపద మీద ఆంధ్రా నేతల (AP Leaders) కన్ను పడిందని, కేసీఆర్ (KCR) మళ్లీ రాకపోతే సంపదంతా వారు తీసుకువెళతారని ఆందోళన వ్యక్తం చేశారు. వెలుగులు విరజిమ్ముతున్న తెలంగాణను మళ్లీ గుడ్డి దీపంగా మార్చవద్దన్నారు. బీఆర్ఎస్‌ (BRS)కు ఓటు వేసి.. కేసీఆర్‌కు పట్టం కట్టాలని గంగుల కమలాకర్ కోరారు.

తెలంగాణ (Telangana) రాకముందు రాష్ట్రంలో కరెంట్ (Current), నీళ్లు (Water) లేవని, ఫించన్ (Pension) వచ్చేదికాదని గంగుల కమలాకర్ విమర్శించారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని.. అందుకనే తెలంగాణ రావాలని కోట్లాడమని.. రాష్ట్రం వచ్చాక మన కరెంట్, నీళ్లు, నిధులు వస్తున్నాయని అన్నారు. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress), పార్టీలు మాట్లాడుకుని హైదరాబాద్‌ను ఆంధ్రాలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని.. తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వస్తే మళ్లీ ఆంధ్రా పెత్తనం వస్తాదని.. తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకుందామని అన్నారు. తెలంగాణలో మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలని గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-11-10T14:08:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising