Korutla Deepthi Case: చందన తన అక్క దీప్తిని ఎలా చంపిందంటే.. వెల్లడించిన జగిత్యాల జిల్లా ఎస్పీ..
ABN, First Publish Date - 2023-09-02T17:58:32+05:30
కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ ప్రాంతంలో బంకి దీప్తి(24) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ మర్డర్ మిస్టరీ వివరాలను జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ మీడియాకు పూసగుచ్చినట్టు వివరించారు. చంపింది చెల్లెనే అని, చున్నీతో గొంతు నులిమి చంపారని ఆయన తెలిపారు. ఉమర్‌ను కోరుట్ల రమ్మని చందనే కోరిందని, దీప్తి, చందన ఇద్దరూ మద్యం తాగేలా ప్లాన్ చేసి.. చందన, ఉమర్ డబ్బు, నగదుతో పారిపోవాలని చూశారని జగిత్యాల ఎస్పీ భాస్కర్ వివరించారు.
జగిత్యాల: కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ ప్రాంతంలో బంకి దీప్తి(24) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ మర్డర్ మిస్టరీ వివరాలను జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ మీడియాకు పూసగుచ్చినట్టు వివరించారు. చంపింది చెల్లెనే అని, చున్నీతో గొంతు నులిమి చంపారని ఆయన తెలిపారు. ఉమర్ షేక్ సుల్తాన్‌తో చందన ప్రేమలో ఉందని, చందనతో పెళ్లికి ఉమర్ షేక్ తొలుత నిరాకరించాడని తెలిసింది. ఉమర్‌ను కోరుట్ల రమ్మని చందనే కోరిందని, దీప్తి, చందన ఇద్దరూ మద్యం తాగేలా ప్లాన్ చేసి.. చందన, ఉమర్ డబ్బు, నగదుతో పారిపోవాలని చూశారని జగిత్యాల ఎస్పీ భాస్కర్ వివరించారు.
చందన బయటకు వెళ్లే సమయంలో దీప్తి నిద్ర లేచిందని, దీంతో దీప్తిని చున్నీతో ఇద్దరు కలిసి చంపేశారని చెప్పారు. ఈ హత్యలో ఏ1 చందన, ఏ2 సుల్తాన్, ఏ3 సుల్తాన్ తల్లి సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీప్తి కేసుని ఛేదించేందుకు ఐదు బృందాలు ఏర్పాటు చేశామని, కేసు ఛేదనలో సాంకేతికత ఉపయోగ పడిందని చెప్పారు. ఆర్మూర్ దగ్గర చందన, ఆమె బాయ్ ఫ్రెండ్ దొరికాడని జగిత్యాల ఎస్పీ చెప్పారు.
కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ ప్రాంతంలో బంకి దీప్తి(24) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గత మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీప్తి చెల్లెలు కనిపించకుండా పోవడంతో పాటు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రకాశం జిల్లాకు చెందిన బంకి శ్రీనివాస్ 30 ఏళ్ల క్రితం కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బకు వచ్చి మేస్త్రీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. శ్రీనివాస్‌కు దీప్తి, చందనతో పాటు కుమారుడు ఉన్నాడు. ఇద్దరు కుమార్తెలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ ఇంటి నుంచే పని చేస్తున్నారు. శ్రీనివాస్ దంపతులు గత సోమవారం వారి బంధువుల ఇంట్లో జరిగిన శుభ కార్యానికి వెళ్లారు. ఈ క్రమంలో దీప్తి(24), చందన ఇంటి వద్ద పని చేసుకుంటూ ఉన్నారు. శ్రీనివాస్ మంగళవారం ఉదయం నుంచి కూతుర్లకు ఫోన్ చేశాడు. దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
చందన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంటి పక్కవారికి శ్రీనివాస్ ఫోన్ చేసి తన ఇంటికి వెళ్లి చూడమన్నాడు. దీంతో వారు ఇంట్లోకి వెళ్లి చూడగా దీప్తి ముందు రూంలోని సోఫాలో పడి ఉండటాన్ని గమనించి తండ్రి శ్రీనివాస్‌తో పాటు చుట్టు పక్కలవారికి సమాచారం అందించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని మెట్‌పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డితో పాటు కోరుట్ల సీఐ ప్రవీణ్, ఎస్‌ఐ కిరణ్‌కుమార్ పరిశీలించారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే డాగ్‌స్వ్కాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఇంట్లో ఉన్న ఓ మద్యం బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - 2023-09-02T18:07:34+05:30 IST