Gangula Kamalakar: కేసీఆర్‌కు సరితూగే నాయకుడు లేడు
ABN, First Publish Date - 2023-10-18T14:51:09+05:30
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సరితూగే నాయకుడు లేరని.. ఢిల్లీ పాలకుల చేతుల్లో పెడితే తెలంగాణ భవిష్యత్ ఆగం అవుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (CM KCR) సరితూగే నాయకుడు లేరని.. ఢిల్లీ పాలకుల చేతుల్లో పెడితే తెలంగాణ భవిష్యత్ ఆగం అవుతుందని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. బుధవారం జిల్లాలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజాఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడుతూ.. ‘‘వరుసగా 3 సార్లు నన్ను గెలిపించారు... నాకంటే ముందు అనేకమంది ఎమ్మెల్యేలు.. మంత్రులు చేశారు..కానీ అభివృద్ధి శూన్యం’’ అని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కోటి రూపాయలు నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదని తెలిపారు. నేడు 300 కోట్లతో తెలంగాణలో కరీంనగర్ అభివృద్ధి చేసుకున్నామని చెప్పుకొచ్చారు. హిందూ ముస్లింలు కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇక్కడ మత సామరస్యాన్ని కాపడినం అభివృద్ధి సాధించామన్నారు. ఆంధ్ర నాయకులు బీజేపీ, కాంగ్రెస్ ముసుగు వేసుకుని వస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నా ఏ పదవిలో ఉన్నా ప్రజల మధ్యనే ఉన్నానని.. మరోసారి గెలిపించి బలం ఇవ్వాలని అభివృద్ధిని కొనసాగించాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు.
Updated Date - 2023-10-18T14:51:09+05:30 IST