ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: సక్సెస్‌లో రామగుండం యువకుడు

ABN, First Publish Date - 2023-08-24T14:05:23+05:30

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతం అయింది.ఈ మిషన్ సక్సెస్‌తో ప్రపంచ దేశాల ముందు ఇస్రో ఇండియాను గర్వపడేలా చేసింది. అయితే ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో తెలంగాణ యువకుడు కీలక పాత్ర పోషించారు.

రామగుండం: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతం అయింది.ఈ మిషన్ సక్సెస్‌తో ప్రపంచ దేశాల ముందు ఇస్రో ఇండియాను గర్వపడేలా చేసింది. అయితే ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో తెలంగాణ యువకుడు కీలక పాత్ర పోషించారు. పెద్దపల్లి జిల్లా రామగుండానికి(Ramagundam) చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త కేవీఎల్‌ కార్తీక్‌(KVL Karthik) ప్రముఖ పాత్ర పోషించారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌నకు చెందిన కార్తీక్‌ పదోతరగతి వరకు చిన్మయి పాఠశాలలో (ప్రస్తుతం సచ్‌దేవ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ)లో చదివారు. అనంతరం విజయవాడలో ఇంటర్‌, హైదరాబాద్‌లో బీటెక్‌, బెంగుళూరులో ఎంటెక్‌ చదివి క్వాల్‌కమ్‌లో ఏడాది పాటు పనిచేశారు.

ఏడేళ్ల నుంచి ఇస్రోలో విశేష సేవలు అందిస్తున్నారు. కాగా కార్తీక్‌ తల్లిదండ్రులు కేవీఎల్‌ సత్యప్రసాద్‌, రమాదేవి సచ్‌దేవ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలో తెలుగు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం కాగా పెద్ద కుమారుడు కార్తీక్‌ దేశ ఖ్యాతిని పెంపొందించే ఇస్రోలో శాస్త్రవేత్తగా రాణిస్తున్నారు. దేశం సగర్వంగా చెప్పుకునే చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన బృందంలో తమ కుమారుడు ఉండడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశం గర్వపడేలా చేశారంటూ కార్తీక్‌ని వారి బంధుమిత్రులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్త కార్తీక్‌ సొంత గ్రామం రామగుండంలో సంబరాలు అంబరాన్నంటాయి.

Updated Date - 2023-08-24T14:16:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising