ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy: కేటీఆర్ను బర్తరఫ్ కాదు... చంచల్ గూడ జైలులో పెట్టాలి...

ABN, First Publish Date - 2023-03-19T14:30:18+05:30

కామారెడ్డి: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదివారం కామారెడ్డి జిల్లా, గాంధారిలో ఒక్కరోజు నిరుద్యోగ నిరహార దీక్ష (Hunger Strike) చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కామారెడ్డి: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదివారం కామారెడ్డి జిల్లా, గాంధారిలో ఒక్కరోజు నిరుద్యోగ నిరహార దీక్ష (Hunger Strike) చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015 నుంచి ఇప్పటి వరకు జరిగిన టీఎస్‌పీఎస్సీ (TSPSC) పరీక్ష పత్రాల లీకేజీలో కొందరికి లబ్ధి జరిగిందన్నారు. మంత్రి కేటీఆర్ (Minister KTR)ను బర్తరఫ్ చేయడమేకాకుండా.. చంచల్ గూడ జైలు (Chanchal Guda Jail)లో పెట్టాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ (CM KCR) కు కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి అయితే.. కేటీఆర్కు షాడో మంత్రి ఆయన పీఏ అని, ఈ కథ నడిపింది మొత్తం కేటీఆర్ పీఏ తిరుపతియేనని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ మంత్రి కార్యాలయమే అన్ని వ్యవహారాలు నడిపిందని, ఏ విచారణ జరిపినా కేటీఆర్ పేషీ నుంచే మూలాలు బయటపడుతున్నాయని రేవంత్ వ్యాఖ్యానించారు.

రాజశేఖర్, కేటీఆర్ పీఏ తిరుపతి ఊర్లు పక్కపక్కనే ఉన్నాయని, కేటీఆర్ పీఏ, రాజశేఖర్ల సన్నిహితులకు అత్యధిక మార్కులు వచ్చాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గ్రూప్-1లో 100కు పైగా మార్కులు వచ్చిన అందరి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పీఏ తిరుపతి సూచన మేరకే.. రాజశేఖర్కు టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించి రాజశేఖర్ను టీఎస్‌పీఎస్సీకి పంపించారన్నారు. టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తూ పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు. గతంలో టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తూ గ్రూప్ 1 పరీక్ష రాసిన.. మాధురికి ఒకటవ ర్యాంక్, రజనీకాంత్కు 4వ ర్యాంకులు వచ్చాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-03-19T14:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising