ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: ప్రధాని మోదీ, బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

ABN, First Publish Date - 2023-04-12T17:36:35+05:30

ప్రధాని మోదీ (PM Modi)పై మంత్రి కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. మోదీ ఎవనికి దేవుడు? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సిలెండర్ ధర పెంచినందుకి దేవుడా?

సిరిసిల్ల: ప్రధాని మోదీ (PM Modi)పై మంత్రి కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. మోదీ ఎవనికి దేవుడు? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సిలెండర్ ధర పెంచినందుకి దేవుడా? అని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రియమైన ప్రధాని కాదు..పిరమైన ప్రధాని అని విమర్శించారు. అప్పులు ఆకాశంలో.. ఆదాని ఆకాశంలో..పేదోడి మాత్రం పాతలంలో అని మండిపడ్డారు. మసీదులు తవ్వడానికే ఎంపీ అయ్యవా? అంటూ బండి సంజయ్ (Bandi Sanjay) పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వారం ఏ దేవుడు..అన్న పాట తప్ప సంజయ్ దగ్గర ఏమీ లేదన్నారు. మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాగా సీఎం కేసీఆర్ ఆశీస్సుల‌తో, నాటి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రోద్బ‌లంతో, ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో ఎక్క‌డా లేని విధంగా వ్య‌వ‌సాయ కాలేజీని ఏర్పాటు చేసుకుని ఇవాళ ప్రారంభించుకున్నాం అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ కళాశాలలోని వసతులను సద్వినియోగం చేసుకుంటే దేశానికే గర్వకారణంగా నిలిచే శాస్త్ర‌వేత్త‌లు, అగ్రానమిస్ట్‌లు తయార‌వుతారని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Updated Date - 2023-04-12T17:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising