ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kavitha: ముగిసిన కవిత దీక్ష.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం కొనసాగుతుంది

ABN, First Publish Date - 2023-03-10T16:34:15+05:30

జంతర్‌మంతర్‌లో (Jantar Mantar) మహిళా రిజర్వేషన్ బిల్లు (Womens Reservation Bill) కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) చేపట్టిన దీక్ష ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ: జంతర్‌మంతర్‌లో (Jantar Mantar) మహిళా రిజర్వేషన్ బిల్లు (Womens Reservation Bill) కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) చేపట్టిన దీక్ష ముగిసింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు జాతీయ మహిళల సమస్య అని, మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయ సమస్య కాదని కవిత అన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకి చెందిన అంశం కాదని, మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆమె డిమాండ్ చేశారు. దీని కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు పోరాడాలని, పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి చొరవ తీసుకోవాలని కవిత అన్నారు.

మరోవైపు... ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రేపు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విచారణ జరగాల్సి ఉంది. అయితే నేడు అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ అయ్యారు. ఆయన నేడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED)కి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు చేశారు. పిళ్లై దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు.. ఈడీకి నోటీసులు పంపించింది.

రేపు రామచంద్ర పిళ్లై వాంగ్మూలం ఆధారంగానే కవితను విచారించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. నిజానికి 9వ తేదీనే ఆమెను విచారించాల్సి ఉంది. అయితే ఆమె ముందుగానే ఖరారైన షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని.. 11న విచారణకు హాజరవుతానని ఈడీకి తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు అరుణ్ రామచంద్ర పిళ్లై ట్విస్ట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పిళ్లై తన వాంగ్మూలంలో తాను కవిత బినామీనని చెప్పారు. అలాగే ఆమె చెప్పినందునే తన ఖాతాలోకి రూ.32 కోట్లు వచ్చాయని ఈడీకి తెలిపారు. అలాగే ఒక కోటి రూపాయలు సైతం ఆయన సొంత అకౌంట్‌లో పడ్డాయని తెలిపారు.

Updated Date - 2023-03-10T16:34:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising