Kavitha ED Enquiry Live Updates : కవిత మూడో రోజు విచారణపై ముగిసిన ఉత్కంఠ.. నో అరెస్ట్.. బయటకొచ్చిన కవిత
ABN, First Publish Date - 2023-03-21T10:53:10+05:30
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత విచారణ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. నేడు మూడోసారి ఆమె ఈడీ విచారణకు హాజరుకాబోతున్నారు...
09:41 PM: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మూడో రోజు విచారణ ముగిసింది. ఈడీ కార్యాలయం నుంచి కవిత బయటకొచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేస్తూ తుగ్లగ్ రోడ్‌లోని కేసీఆర్ నివాసానికి ఆమె బయలుదేరారు. అయితే తదుపరి విచారణ రావాలంటూ ఈడీ ఏమైనా సమాచారం ఇచ్చిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
08:31 pm : ముగిసిన కవిత ఈడీ విచారణ
నేటికి ముగిసిన కవిత ఈడీ విచారణ
ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత
సుమారు 8 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన ఈడీ అధికారులు
ప్రశ్నోత్తరాలు పూర్తి కావడంతో.. అనంతర లాంఛనాలు పూర్తి చేసుకుని ఈడీ కార్యాలయం నుంచి బయటకు రానున్న కవిత
కవితను ఇవాళ అరెస్ట్ చేస్తారనే వార్తలతో ఉదయం నుంచి బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్
కవిత బయటికి రావడంతో హ్యాపీగా ఫీలవుతున్న బీఆర్ఎస్ శ్రేణులు
8:16 pm : కవిత రాక కోసం బీఆర్ఎస్ శ్రేణుల ఎదురుచూపు
ఉదయం 11:30 గంటలకు ఈడీ విచారణకు వెళ్లిన కవిత
రాత్రి 8:20 గంటలు అవుతున్నా బయటికి రాని కవిత
కవిత రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు
మరోవైపు కవితను ఇవాళ అరెస్ట్ చేస్తారని హస్తినలో చక్కర్లు కొడుతున్న వార్తలు.. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో పెరిగిపోయిన టెన్షన్
08:03 pm : కవిత ఈడీ విచారణ ఇప్పటి వరకూ ఇలా..
మార్చి 11న మొదటిరోజు 9గంటలపాటు ఈడీ విచారణ
మార్చి 20న రెండోరోజు పదిన్నర గంటలపాటు ఈడీ విచారణ
మార్చి 21న మూడోరోజు మూడో రోజు 8 గంటలకు పైగా కొనసాగుతున్న విచారణ
ఇప్పటి వరకూ మొత్తం మూడు రోజులు.. ఇరవై ఏడున్నర గంటలుపాటు సాగిన విచారణ
07:56 pm : సంతకాల కోసమే..!
ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన బీఆర్‌ఎస్ లీగల్ సెల్ జనరల్ సెక్రెటరీ సోమా భరత్
ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తితో సోమా భరత్‌ను ఈడీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు
కవితకు సంబంధించిన ఆథరైజేషన్ సంతకాల కోసం పిలిపించినట్లు సమాచారం
తదుపరి విచారణలో అవసరమైతే కవితా బదులు సోమా భరత్‌ను పంపించేందుకు.. కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అందజేసేందుకు పిలిపించినట్లు సమాచారం.
07:25 PM: సోమా భరత్ వెళ్లడంతో..!
8 గంటల నుంచి కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ.
విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి వెళ్లిన కవిత అడ్వకేట్ సోమా భరత్
ఆయన ఈడీ ఆఫీసుకు వెళ్లడంతో హస్తినలో నెలకొన్న ఉత్కంఠ
07:15 PM: టెన్షన్.. టెన్షన్
ED కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కవిత అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పుకార్లు
ED కార్యాలయం లోపలికి వెళ్లిన కవిత లాయర్లు
ED కార్యాలయం నుంచి కవిత లాయర్ లకు పిలుపు
కవిత కుటుంబ సభ్యులను కూడా ED కార్యాలయం కు పిలిచినట్లు సమాచారం
కవిత అరెస్ట్ పై కొనసాగుతున్న సస్పెన్స్
06:37 PM: ఏడు గంటలుగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ.
05:53 PM: ఈడీ కార్యాలయం పరిధిలో 144 సెక్షన్ విధింపు. భారీగా మోహరించిన కేంద్ర బలగాలు. ఆరున్నర గంటలుగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ.
04:46 PM: చెల్లి కవిత ఈడీ విచారణను ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ మొదటిసారి ట్వీట్ చేశారు. ‘ఈ రోజు ఒకరు గిఫ్ట్ ఇచ్చారు’ అనే ట్యాగ్‌తో ‘ప్రజాస్వామ్యాన్ని అంతమొందించేందుకు.. నిరంకుశత్వం దిశగా భారత్’ అనే పుస్తకం కవర్ పేజీ ఫొటోను కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పుస్తకాన్ని దెబాశిష్ రాయ్ చౌదరి, జాన్ కీన్ రచించారు. కాగా రాజకీయ కక్షసాధింపులో భాగంగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారని ఇదివరకే కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
04:36 PM: ఉదయం 11:30 గంటల నుంచి కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ. ఐదున్నర గంటలుగా ఈడీ కార్యాలయంలోనే కవిత. విచారణ ఎప్పుడు ముగుస్తుందనే దానిపై అంతకంతకు పెరుగుతున్న ఉత్కంఠ.
04:00 PM: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ వరుసగా రెండో రోజు కొొనసాగుతోంది. ఉదయం 11:30 గంటలకు ఆమె ఈడీ ఆఫీస్‌కు వెళ్లారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. కాగా ఇప్పటికే రెండు సార్లు ఈడీ విచారణకు హాజరైన కవితను ఈడీ అధికారులు విచారించి ఇంటికి పంపారు. మరి విచారణలో మూడో రోజయిన మంగళవారం ఈడీ ఏం చేయబోతోందనేది ఉత్కంఠగా మారింది. విచారణ అనంతరం ఇంటికి పంపిస్తారా? లేక అనూహ్యంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విచారణ ఎన్నిగంటల వరకు కొనసాగుతుందో కూడా స్పష్టత లేదు.
03:29 PM: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతోంది. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. సిసోడియా తరపు, సీబీఐ లాయర్ల వాదనలు.
03:04 PM: మూడున్నర గంటలుగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ. వరుసగా రెండో రోజు ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు.
02:30 PM: హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధింపు.
02:00 PM: కవితకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
‘‘ ఏ ఆధారాలు లేకుండా ముందుగానే ఊహించుకుని కవితపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. అసలు సెల్‌ఫోన్లు ఉన్నాయా? లేవా? నోటీసులు ఇవ్వకుండా కవితపై ఎలా నిందలు వేస్తారు?. నిన్న ఈడీ అధికారులు సెల్‌ఫోన్లపై అడిగిన ప్రశ్నలకు మంగళవారం తీసుకువస్తానని కవిత చెప్పారు. తీసుకొచ్చారు. ఈడీకి లేఖ కూడా రాశారు. దీనికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు?’’ అని కేంద్రమంతి కిషన్ రెడ్డిని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఒకరిపై విమర్శలు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని హితబోధ చేశారు.
01:45 PM: అడిషనల్ అడ్వకేట్ జనరల్ జే.రాంచందర్ రావును తొలగించండి: గవర్నర్‌కు కాంగ్రెస్ లేఖ
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత కేసులో తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ జే.రాంచందర్ రావు ఈడీ కార్యాలయానికి వెళ్లడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ప్రైవేటు కేసులో అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈడీ ఆఫీస్‌కు వెళ్లడం చట్టవిరుద్ధం కాబట్టి ఆయనను తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కాంగ్రెస్ లీడర్ బక్కా జడ్సన్ లేఖ రాశారు. జే.రాంచందర్ రావు అవినీతి సంపాదనపై ఏబీసీ దర్యాప్తునకు ఆదేశించాలని గవర్నర్‌ను లేఖలో కోరారు.
01:30 PM: 2 గంటలుగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వరుసగా రెండో రోజు కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
01:15 PM: కవిత ఉపయోగించిందని ఈడీ చెబుతున్న ఫోన్లు ఇవే..
01:05 PM: గంటన్నరగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
01:00 PM: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత విచారణపై తెలంగాణ మంత్రుల మీడియా సమావేశం ప్రారంభం.
12:30 PM: ఈడీ ఆఫీస్ వద్ద 144 సెక్షన్.. బ్యానర్లు కట్టిన పోలీసులు
12:03 PM: ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కవిత సంచలన లేఖ రాశారు. ‘‘ దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నాను. ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలిగించదా?. నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణకు ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే. లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం’’ అని లేఖలో కవిత పేర్కొన్నారు.
11:43 AM: ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ.
‘‘ఈడీ చేస్తున్న తప్పుడు ఆరోపణలకు సమాధానంగా నేను వాడిన ఫోన్లను అందజేస్తున్నాను. ఒక మహిళగా తన ప్రైవసీని కూడా కాదని ఫోన్లు అందజేస్తున్నాను’’ అని లేఖలో కవిత పేర్కొన్నారు.
11:30 AM: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మూడోసారి ఈడీ ముందు హాజరైన ఎమ్మెల్సీ కవిత. ఆమె వెంట భర్త అనిల్ ఉన్నారు. ఈ రోజు తన 10 ఫోన్లను ఈడీ అధికారులకు అందజేయనున్న కవిత.
11:25 AM: నివాసం నుంచి బయటకొచ్చిన ఎమ్మెల్సీ కవిత తన ఫోన్లను మీడియాకు చూపించారు. విజయ సంకేతం చూపిస్తూ పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. అనంతరం తన లాయర్లతో కలిసి ఈడీ కార్యాలయానికి బయలుదేరారు.
11:23 AM: ఇంటి నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ శ్రేణులను కలిసిన ఎమ్మెల్సీ కవిత.
11:12 AM: ఈడీ విచారణకు వెళ్లే ముందు ఎమ్మెల్సీ కవిత మీడియా మాట్లాడే అవకాశం ఉంది. 10 ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ అభియోగాలు మోపిన నేపథ్యంలో ఆ ఫోన్లను మీడియా చూపించే అవకాశాలున్నాయి.
11:09 AM: న్యాయనిపుణులతో ముగిసిన కవిత సమావేశం. విచారణకు సంబంధించిన కీలక విషయాపై తన లాయర్లతో ఆమె చర్చించారని సమాచారం.
11:05 AM: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
10:50 AM: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquior Scam Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే.కవిత (MLC Kavitha) నేడు (మంగళవారం) మూడోసారి ఈడీ (ED) విచారణకు హాజరుకానున్నారు. మరికొద్ది సేపట్లో ఈడీ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఈడీ సూచించిన సమయం ఉదయం 11:30 గంటలకు ఆమె ఆఫీస్‌కు రానున్నారు. కాగా ఉదయం నుంచి ఈడీ కార్యాలయం వెలుపల కట్టుదిట్టమైన భద్రత కనిపిస్తోంది. ఈ స్థాయి భద్రత దేనికి సంకేతం? అనే సందేహాలు రేకెత్తిస్తున్నాయి. కవిత అరెస్ట్ తప్పదా? అనే ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నాయి.
నిన్న 10:30 గంటల సుధీర్ఘ విచారణ..
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోమవారం ఏకంగా పదిన్నర గంటల పాటు ప్రశ్నించారు. మళ్లీ మంగళవారం ఉదయం 11.30 గంటలకు హాజరు కావాలంటూ ఆమె చేతికి తాఖీదు అందించారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించినకవిత.. రాత్రి 9.15 గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. లోపలి నుంచి బాగా కందిపోయిన ముఖంతో వచ్చిన ఆమె.. కారులో కూర్చున్న తర్వాత ముఖానికి చిరునవ్వు పులుముకుని కార్యకర్తలకు విజయసంకేతం చూపించారు. నిజానికి కవితను సోమవారం అరెస్టు చేసే అవకాశాలు లేవని ఈడీ అధికారి ఒకరు ఉదయాన్నే మీడియాకు అనధికారికంగా వెల్లడించారు. అయితే మంగళవారం విచారణ తర్వాత ఆమెను అరెస్టు చేసే అవకాశాలు లేవని చెప్పలేనని అదే అధికారి పేర్కొనడం గమనార్హం. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. కవితను ఈడీ కార్యాలయం రెండవ అంతస్తులోని ఒక గదిలో సుదీర్ఘంగా విచారించారు. దర్యాప్తు అధికారి జోగీందర్, ఒక మహిళా అధికారితో పాటు ముగ్గురు అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు.
Updated Date - 2023-03-21T21:41:52+05:30 IST