Chandra Mohan : చంద్రమోహన్ మృతిపై కేసీఆర్, జగన్, పవన్‌ల స్పందన..
ABN, First Publish Date - 2023-11-11T12:40:52+05:30
ముఖ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమోహన్ దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారని.. ఆయన మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. ఆయన స్ఫూర్తితో ఎందరో నటీనటులుగా ఎదిగారని చెప్పారు. తెలుగు, ఇతర భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారని కేసీఆర్ తెలిపారు.
Chandra Mohan : ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమోహన్ దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారని.. ఆయన మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. ఆయన స్ఫూర్తితో ఎందరో నటీనటులుగా ఎదిగారని చెప్పారు. తెలుగు, ఇతర భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారని కేసీఆర్ తెలిపారు.
ప్రముఖ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరమని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
చంద్ర మోహన్ కన్ను మూశారని తెలిసి ఆవేదన చెందానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన్ని తెరపై చూడగానే మనకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తినో, మన బంధువునో చూస్తున్నట్లు అనిపించేదన్నారు. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనను చూపించారన్నారు. పదహారేళ్ళ వయసు, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, రాధా కళ్యాణం లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారని పవన్ గుర్తు చేసుకున్నారు. శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యంలో నానావలిగా గుర్తుండిపోతారన్నారు. చంద్ర మోహన్‌తో మా కుటుంబానికి స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. అన్నయ్య చిరంజీవితో కలిసి చంటబ్బాయి, ఇంటిగుట్టు లాంటి చిత్రాల్లో నటించారని పవన్ అన్నారు. తన మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో మంచి పాత్ర పోషించారన్నారు. తమ్ముడు చిత్రంలో మా ఇద్దరి మధ్య అలరించే సన్నివేశాలుంటాయన్నారు. చంద్రమోహన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ తెలిపారు.
Updated Date - 2023-11-11T12:46:55+05:30 IST