కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gaddar Last Rites : కేసీఆర్ కీలక నిర్ణయం.. అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు

ABN, First Publish Date - 2023-08-06T21:49:40+05:30

ప్రజా గాయకుడు, యుద్ధనౌక గద్దర్ (Gaddar) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిర్ణయించింది. జీవితాంతం వారు చేసిన త్యాగాలు ప్రజా సేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు..

Gaddar Last Rites : కేసీఆర్ కీలక నిర్ణయం.. అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు

హైదరాబాద్ : ప్రజా గాయకుడు, యుద్ధనౌక గద్దర్ (Gaddar) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిర్ణయించింది. జీవితాంతం వారు చేసిన త్యాగాలు ప్రజా సేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. ఈ మేరకు.. గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధించిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని (TS Govt CS) సీఎం ఆదేశించారు. తన జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ తెలంగాణ గర్వించే బిడ్డ అని సీఎం అన్నారు. మరోవైపు ఎల్బీ స్టేడియానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. గద్దర్ పార్థీవ దేహానికి నివాళులు ఆర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు మంత్రి. కాగా.. గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు, కవులు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.


Gaddar Death.jpeg

అంతిమ యాత్ర ఇలా..

  • సోమవారం ఉదయం 11 గంటలకు ఎల్బీ స్డేడియం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం

  • కళాకారులతో భారీ ర్యాలీగా వెళ్లనున్న గద్దర్ పార్థీవదేహం

  • అంతిమయాత్రలో పాల్గొననున్న కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీల నేతలు

  • ఎల్బీ స్టేడియం నుండి బషీర్ బాగ్ చౌరస్తా, జగ్జీవన్ రామ్ విగ్రహం మీదుగా గన్ పార్క్ వైపు అంతిమయాత్ర

  • గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు గద్దర్ పార్థీవదేహం

  • కాసేపు అమరవీరుల స్థూపం వద్ద గద్దర్ పార్థీవ దేహాన్ని ఉంచి పాటలతో నివాళులు అర్పించనున్న కళాకారులు

  • అమరవీరుల స్థూపం నుంచి భూదేవినగర్‌లోని గద్దర్ నివాసానికి వెళ్లనున్న పార్థివదేహం

  • భూదేవినగర్‌లోని మహాబోధి విద్యాలయం అవరణలో జరగనున్న గద్దర్ అంత్యక్రియలు


ఇవి కూడా చదవండి


#RIP Gaddar : విమల సూచనతో గద్దర్ అంత్యక్రియలు అక్కడే.. రేపు సెలవు..!?


Gaddar Passes Away : ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూత.. అరుదైన ఫొటోలు


TS Politics : అసెంబ్లీలో కేసీఆర్ ఎన్నికల హామీలు.. అన్నీ శుభవార్తలే చెప్పిన సీఎం!


TSRTC Merger Bill : ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం


Gaddar And Pawan : తమ్ముడా.. అని పవన్‌ను గద్దర్‌ చివరిసారిగా పలకరించి ఏం చెప్పారంటే..?



Updated Date - 2023-08-06T21:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising