ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM KCR: ఈ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ను ఎక్కువ సీట్లలో గెలిపించాలి

ABN, First Publish Date - 2023-10-27T18:10:19+05:30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) ని అత్యధిక స్థానాల్లో గెలిపించాలి అని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు.

ఖమ్మం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) ని అత్యధిక స్థానాల్లో గెలిపించాలి అని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. శుక్రవారం నాడు ఖమ్మం జిల్లాలోని జీళ్లచెర్వులో ‘‘ప్రజా ఆశీర్వాద సభ’’ నిర్వహంచారు. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పాలేరు నియోజకవర్గ ప్రజలను అక్కున చేర్చుకుంటున్నారు. సెల్ ఫోన్ నెంబరు ఉందా అని నియోజకవర్గంలోని ప్రజలను సొంతింటి వాడిలా అడిగి సమస్యలను తెలుసుకుంటున్నాడు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడాను. 14, 15సంవత్సరాల పోరాటం తర్వాత భారత ప్రభుత్వం తలవంచి తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ శవయాత్రనా ...తెలంగాణ జైత్రయాత్ర నా అని పోరాడాను. నన్ను సిద్దిపేట నుంచి ఖమ్మం జైలుకి తీసుకుని వచ్చారు. భక్తరామదాసు లిఫ్టు ఇరిగేషన్ కోసం నాతో పాటు నాటి డీజీపీ మహేందర్‌రెడ్డి వచ్చాడు. కరువుతో ఇక్కట్లు పడ్డామని చెప్పారు. పాలేరు ప్రజలను ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పాలేరు నియోజకవర్గానికి నీళ్లు వచ్చాయి. పాలేరు చెరువులు ఒకప్పుడు ఎండిపోయాయి... ఇప్పుడు ఇక్కడి చెరువులు కళకళ లాడుతున్నాయి. నరం లేని నాలుకలు ప్రతిపక్షాల నేతలు ఏదేదో మాట్లాడుతారు... నిజం నిప్పు లాంటిది.... ఆ నేతల మాటలను పట్టించుకోవద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది. భక్తరామదాసు ఎత్తుపోతల తర్వాత భూముల ధరలు ఎలా పెరిగాయో పాలేరు నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి. అనేక మంది పదవుల కోసం పార్టీలు‌ మారుతారు. కార్యకర్తలు మనతోనే ఉన్నారు గమనించాలి’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

పాలేరులో కరువు తొంగి చూడదు

‘‘కమ్యూనిస్టులు ఎక్కువ కాలం జిల్లాను పాలించారు. ఆలోచన చేయాలి....డబ్బుల కట్టలతో వచ్చే వాళ్లు... పూటకో పార్టీ మారే వాళ్ల గురించి ఆలోచన చేయాలి. రైతు బంధు పదాన్ని పుట్టించిందే కేసీఆర్. రైతులు చనిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల జీవితాల్లో వెలుగులు నింపాము. రైతు బంధు పెడితే ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారు. ఇప్పుడు రైతుల ముఖాలు తెల్లబడుతున్నాయి. రైతు , వ్యవసాయం స్థిరీకరణ జరగాలి. తెలంగాణ ధాన్యంలో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో సీతారామ ప్రాజెక్టు పూర్తి కాబోతుంది. ఇక పాలేరులో కరువు తొంగి చూడదు. పార్టీల వైఖరి చూడాలి.... ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు రైతు బంధు దుబారానా..? మరో నాయకుడు రేవంత్‌రెడ్డి మాత్రం మూడు గంటలే కరెంటు ఇస్తాను అంటాడు. డబ్బు ఆహాంకార పూరితంతో రాజకీయం చేయొద్దు. పాలేరులో నోట్ల కట్టలతో ..ప్రజల ఓట్లని కొంటారా. ఇది రాజకీయమా.....? వారు నోట్ల కట్టలు ఇచ్చి లోపల పేగలు లాగుతారు. పాలేరు నుంచి కందాళ ఉపేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. పాలేరుకి దళిత బంధు పథకం నియోజకవర్గం అంతా ఇస్తాను. నోట్ల కట్టలతో వచ్చే వారు ఏం చేయరు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గిరిజనుల పట్ల చులకనగా మాట్లాడుతున్నారు. పేద మహిళలకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాను. సన్న బియ్యం ఇస్తాం. కేసీఆర్ బీమా...గ్యాస్ సిలెండరు 400 రూపాయలకే ఇస్తా’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.

Updated Date - 2023-10-27T18:21:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising