IT Rides: పొంగులేటి ఇంట్లో కొనసాగుతున్న ఐటి సోదాలు.. కాంగ్రెస్ ఆందోళన
ABN, First Publish Date - 2023-11-09T09:32:28+05:30
ఖమ్మం: మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఖమ్మం, నారాయణపురం, హైదరాబాద్ మూడు ప్రాంతాలలో అయిదు చోట్ల ఏకదాటిగ అధికారులు దాడులు చేశారు.
ఖమ్మం: మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) నివాసం, కార్యాలయాల్లో ఐటి అధికారుల (IT Officers) సోదాలు కొనసాగుతున్నాయి. ఖమ్మం, నారాయణపురం, హైదరాబాద్ మూడు ప్రాంతాలలో అయిదు చోట్ల ఏకదాటిగ అధికారులు దాడులు చేశారు. పొంగులేటితో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. మొత్తం ఎనిమిది బృందాలు సోదాలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పొంగులేటి ఇంటికి చేరుకుంటున్నారు. ఐటి దాడులను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
కాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ సోదాలను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్ ఖండించారు. పొంగులేటి నివాసం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి ఆందోళనలో పాల్గొన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ కక్ష్య పూరిత చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్‌ది ఫెవికాల్ బంధమని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చేస్తామని, ఏ ఒక్కరినీ వదిలేది లేదని తుమ్మల యుగంధర్ అన్నారు.
కాగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం, కార్యాలయాలపై గురువారం తెల్లవారుజామున ఐటి అధికారులు (IT Officers) సోదాలు చేపట్టారు. అయితే ఇది ఊహించిన పరిణామమే అని పొంగులేటి అనుచరులు అంటున్నారు. తనపై ఐటి దాడులు ఉండొచ్చునని మూడు రోజుల క్రితమే పొంగులేటి ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
గురువారం తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ఖమ్మంలోని పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 8 వాహనాల్లో ఐటీ అధికారులు వచ్చారు. కాగా ఈరోజు పొంగులేటి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులందరూ ఖమ్మంలోని ఇంటికి చేరుకున్నారు. తెల్లవారుజాము 4:30 గంటలకు వచ్చిన ఐటీ అధికారులు పొంగులేటి కుటుంబసభ్యుల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి అనుచరుల సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో పొంగులేటికి చెందిన నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
Updated Date - 2023-11-09T09:32:30+05:30 IST