ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ponguleti: క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి

ABN, Publish Date - Dec 25 , 2023 | 10:06 AM

భద్రాద్రి కొత్తగూడెం: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ సోదరులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం ఇల్లందు సింగరేణి జెకే ఓపెన్ కాస్ట్ కార్యాలయం వద్ద ఐఎన్టీయూసీ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన పిట్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ సోదరులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఇల్లందు సింగరేణి జెకే ఓపెన్ కాస్ట్ కార్యాలయం వద్ద ఐఎన్టీయూసీ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన పిట్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కోరం కనకయ్యను అధిక మెజార్టీతో గెలిపించిన ఓటర్లకి అభినందనలు తెలిపారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులందరూ ఐఎన్‌టియుసిని ఆదరించాలని కోరారు.

కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉందని, వారి గుండెల్లో ఇందిరమ్మ రాజ్యం ఉందని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. సింగరేణిలో టీబీజీకేఎస్ మాయమాటలు చెప్పి రెండు పర్యాయాలు గెలిచిందని, బీఆర్ఎస్ పార్టీలో ఉండి మోసపోయి గోసపడి ఈరోజు విముక్తి అయ్యారన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం కృషి చేస్తానన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో 15 వేల మంది ఉద్యోగాల తగ్గింపు జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను చేపట్టే కార్యక్రమం ప్రారంభించిందని చెప్పారు.

జేకేఓసి ఎక్స్‌టెన్షన్ చేస్తామని, కార్మికులకు రూ. 20 లక్షల వడ్డీలేని రుణాన్ని అమలు చేస్తామని, ఇన్‌కంటాక్స్ మినహాయింపు కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకోబోతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కారుణ్య నియామకాలు న్యాయంగా జరగలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కారుణ్య నియామకాల కోసం ఉద్యోగానికి రూ. నాలుగు లక్షలు చేతులు మారాయని, కారుణ్య నియామకాల కోసం ఖర్చు పెట్టుకుండా ఇప్పించే బాధ్యత తనదని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Dec 25 , 2023 | 10:06 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising