Puvvada Ajay: బీఆర్ఎస్‌ను ఎవరూ ఏం చేయలేరు
ABN, First Publish Date - 2023-08-22T15:53:33+05:30
‘కొందరు నాయకులు పార్టీలో ఉండి బయటకు వెళ్లారు. వెళ్తూ వెళ్తూ బీఆర్ఎస్ నుంచి ఎంత మందిని తీసుకెళ్తానో చూడండి అని సవాల్ చేశారు. మా పార్టీ నుంచి నాయకులను కాదు కదా కనీసం ఈకను కూడా తీసుకుని వెళ్లలేకపోయారు.
ఖమ్మం: సీఎం కేసీఆర్ (Cm kcr) తనను కొడుకు లెక్క చూసుకుంటారని మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay) తెలిపారు. ఖమ్మం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘‘కొందరు నాయకులు పార్టీలో ఉండి బయటకు వెళ్లారు. వెళ్తూ వెళ్తూ బీఆర్ఎస్ నుంచి ఎంత మందిని తీసుకెళ్తానో చూడండి అని సవాల్ చేశారు. మా పార్టీ నుంచి నాయకులను కాదు కదా కనీసం ఈకను కూడా తీసుకుని వెళ్లలేకపోయారు. కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించే సమయంలో కుటుంబ సభ్యుల మధ్య గడపాలని ఖమ్మం వచ్చేశాను. ఈ వేదికపై నుంచి ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయను. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలి. మరొకసారి ఆశీర్వదించాలని కోరుతున్నాను.’’ అని కార్యకర్తలను మంత్రి అభ్యర్థించారు.
Updated Date - 2023-08-22T15:53:33+05:30 IST