Khammam: మున్నేరు వంతెనపై రాకపోకలు బంద్
ABN, First Publish Date - 2023-07-25T23:54:02+05:30
తెలంగాణ(Telangana)లో భారీ వర్షాలు(Heavy rains) పడుతున్నాయి. వానలతో జనజీవనం స్తంభించిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
ఖమ్మం(Khammam): తెలంగాణ(Telangana)లో భారీ వర్షాలు(Heavy rains) పడుతున్నాయి. వానలతో జనజీవనం స్తంభించిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. భారీ వర్షాలు పడుతుండడంతో మున్నేరుకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో వంతెనపై రాకపోకలు బంద్ చేశారు.మున్నేరులో గంటగంటకు వరద ఉధృతి పెరుగుతుండడంతో ముందు జాగ్రత్తగా మున్నేరు బ్రిడ్జి(Munneru bridge)పై రాకపోకలను జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్(Collector VP Gautam) నిషేధించారు.మున్నేరు వరద ఉధృతితో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.పురాతన బ్రిడ్జ్ కావడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం 19 అడుగులకు వరద ప్రవాహం చేరింది. దీంతో అధికారులు ముందుగానే ఇటువైపు వాహనాలు రాకుండా చర్యలు చేపట్టారు.నయాబజార్ స్కూల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధికారులు పునరావస కేంద్రం ఏర్పాటు చేశారు. వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్,విద్యుత్ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - 2023-07-26T04:54:42+05:30 IST