Vasireddy Ramanadham: మంత్రి కేటీఆర్.. ఎన్టీఆర్‌ను అవమానించారు
ABN, First Publish Date - 2023-09-30T19:06:37+05:30
మంత్రి కేటీఆర్(Minister KTR).. ఎన్టీఆర్‌ను అవమానించారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి రామనాధం(Vasireddy Ramanadham) వ్యాఖ్యానించారు.
ఖమ్మం: మంత్రి కేటీఆర్(Minister KTR).. ఎన్టీఆర్‌ను అవమానించారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి రామనాధం(Vasireddy Ramanadham) వ్యాఖ్యానించారు. శనివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘మొన్న కేటీఆర్ తెలంగాణలో చంద్రబాబు విషయంలో ఆందోళనలు సభలు చేయవద్దు అన్నాడు. ఈరోజు కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చి ఎన్టీఆర్ పార్క్ పేరుతో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణ ఒక పద్ధతి లేకుండా జరిగింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. జిల్లాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఖమ్మం జిల్లా టీటీడీపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాదు.ఇక్కడ కేసీఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో జగన్మహన్‌రెడ్డిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.ఎన్టీఆర్ మీద ప్రేమ ఉంటే మంత్రి కేటీఆర్ అలా చేయరు.. కేవలం మీరు ఓట్ల మీద ప్రేమతో చేశారు.ఎన్టీఆర్ వేరు.. తెలుగుదేశం పార్టీ నాయకులు వేరని ఎన్టీఆర్ ఎప్పుడు చెప్పలేదు. రాష్ట్ర ప్రజలు మిమ్మలను ఛీ కొడుతున్నారు. ఎన్టీఆర్ రాజకీయ బిక్ష పెట్టిన నేతలే ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా గెలిచి చూపించండి’’ అని వాసిరెడ్డి రామనాధం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-30T19:06:46+05:30 IST