Komatireddy Venkatreddy : అది నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామాకు సిద్ధమని కేటీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్
ABN, First Publish Date - 2023-07-13T13:57:18+05:30
భువనగిరి మండలం బండ సోమారం విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సందర్శించారు. సబ్ స్టేషన్లో కరెంటు సప్లై రిజిస్టర్ని తనిఖీ చేసి సబ్ స్టేషన్ ఆపరేటర్‌తో కోమటిరెడ్డి మాట్లాడారు.
యాదాద్రి : భువనగిరి మండలం బండ సోమారం విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సందర్శించారు. సబ్ స్టేషన్లో కరెంటు సప్లై రిజిస్టర్ని తనిఖీ చేసి సబ్ స్టేషన్ ఆపరేటర్‌తో కోమటిరెడ్డి మాట్లాడారు. 24 గంటల కరెంటు అనేది పచ్చి అబద్ధమన్నారు. 11 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని.. అందులోనూ కోతలు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగులందరూ కష్టాల్లో ఉన్నారని.. జీతాలు రాక ఈఎంఐలు కట్టక అప్పుల పాలవుతున్నారని అన్నారు. 11 గంటల కంటే విద్యుత్ ఎక్కువ ఇచ్చినట్టు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామాకు సిద్ధమని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
Updated Date - 2023-07-13T13:57:18+05:30 IST