Kondabala: రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి ‘కొండబాల’ రాజీనామా
ABN, First Publish Date - 2023-12-09T10:10:56+05:30
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, బీఆర్‌ఎస్ నేత కొండబాల కోటేశ్వరరావు(Kondabala Koteswara Rao) శుక్రవారం తన విత్తనాభివృద్ధి
వైరా(ఖమ్మం): రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, బీఆర్‌ఎస్ నేత కొండబాల కోటేశ్వరరావు(Kondabala Koteswara Rao) శుక్రవారం తన విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను అగ్రికల్చర్ కోపరేషన్ మార్కెటింగ్‌శాఖ సెక్రటరీకి పంపించారు. 2017లో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితులైన కొండబాల.. ఇటీవలి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తన పదవికి రాజానామా చేస్తున్నట్టు ప్రకటించారు. తనపై విశ్వాసం ఉంచిన కేసీఆర్‌కు, తన పదవీకాలంలో అన్నివిధాలుగా సహకరించిన అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2023-12-09T10:10:57+05:30 IST