Krishna Rao: నగరంలో నివసిస్తున్న అందరూ తెలంగాణ బిడ్డలే
ABN, First Publish Date - 2023-11-23T13:40:21+05:30
మూసాపేట్‌లో బుధవారం ప్రజా ఆశీర్వాద ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి మొదలైన ర్యాలీ
- మాధవరం కృష్ణారావు
కూకట్‌పల్లి(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): మూసాపేట్‌లో బుధవారం ప్రజా ఆశీర్వాద ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి మొదలైన ర్యాలీ జనతా నగర్, యాదవ బస్తీ, గూడ్స్ షెడ్ రోడ్, భరత్‌నగర్, అవంతినగర్ తోట, బబ్బుగూడ ప్రాంతాల మీదుగా సాగింది. ర్యాలీలో పాల్గొన్న బీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు(Madhavaram Krishna Rao) మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మహానగరం శాంతిభద్రతలకు నెలవుగా నిలిచిందన్నారు. అభివృద్ధిలో నగరం ముందు వరుసలో ఉందన్నారు. మూసాపేటలో ఆంధ్ర, ఒడిశా రాష్ట్ర ప్రజలు అధికంగా ఉన్నారని, వారందరూ బీఆర్‌ఎస్ పాలనతో సంతోషంగా ఉన్నారని కృష్ణారావు పేర్కొన్నారు. నగరంలో నివసిస్తున్న అన్ని ప్రాంతాల వారు తెలంగాణ బిడ్డలేనన్నారు. కారు గుర్తుకు ఓటువేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కూకట్‌పల్లి: బీజేపీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు పృథ్వి పార్టీకి బుధవారం రాజీనామా చేశారు.బీఆర్‌ఎస్ అభ్యర్థి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పార్టీ కో-ఆర్డినేటర్ సతీష్ అరోరా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
Updated Date - 2023-11-23T13:40:23+05:30 IST